Monday

ఆంధ్రా బస్సుపై తమిళనాడులో దాడి డ్రైవర్‌తో పాటు నలుగురికి గాయాలు ఘర్షణగా మారిన ఓవర్‌టేక్ వ్యవహారం...



 బస్సు ఓవర్‌టేక్ వ్యవహారం కాస్తా గొడవగా మారి, ఘర్షణకు దారి తీయడంతో తమిళనాడులోని ఈరోడ్ జిల్లాలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ప్రయాణికులపై దాడి జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. హైదరాబాద్‌కు చెందిన యాత్రికులు పర్యాటక శాఖ బస్సులో తమిళనాడులోని పుణ్యక్షేత్రాలు సందర్శిస్తున్నా రు. సోమవారం పళని ఆలయాన్ని సందర్శించిన అనంతరం రాష్ట్రానికి బయల్దేరారు. తి రుప్పూర్-ఈరోడ్ జిల్లాల సరిహద్దుల్లోని వీరనాపాళయం వద్ద వెనుక నుంచి వ్యానులో వచ్చిన చేరన్ కళాశాల విద్యార్థులు దారి ఇవ్వమని అడిగితే ఏపీ బస్సు డ్రైవర్ పట్టించుకోలేదు. 

వాహనాన్ని ఇష్టానుసారంగా నడపడంతో విద్యార్థులు ఆగ్రహించారు. బస్సును ఓవర్‌టేక్ చేసి, వ్యానును రోడ్డుకు అడ్డంగా ఆపి వాగ్వాదానికి దిగారు. ఏపీ బస్సు డ్రైవరును కొట్టారు. దీంతో బస్సులోని వారు విద్యార్థులపై చేయి చేసుకున్నారు. ఇది చూసిన స్థానికులు విద్యార్థులకు మద్దతుగా నిలవడంతో ఘర్షణ పెరిగింది. ఇరువర్గాల వారు బాహాబాహీకి దిగారు. బస్సు డ్రైవర్‌తో పాటు ఇద్దరు బస్సు యాత్రీకులు, ఇద్దరు స్థానికులు గాయపడ్డారు. రాష్ట్రానికి చెందిన బస్సు అద్దాలు, హెడ్‌లైట్లు ధ్వంసమయ్యాయి. దీనిపై ఇరువర్గాల వారు ఈరోడ్ జిల్లా పెరుందురై పోలీసు స్టేషన్‌లో ఫిర్యా దు చేశారు. పోలీసులు ఇరువర్గాలకు నచ్చజెప్పి కేసును ఉపసంహరింపజేశారు.

0 comments:

Post a Comment