ఒంట్లో బాగుండకపోతే వైద్యుడి దగ్గరకెళ్తాం. రోగ లక్షణాలు విన్నాక ఏ డాక్టరైనా ముందుగా చేసే పని బీపీ చెక్ చేయడం! ఒక చేతికి మాత్రమే ఇలా చెక్ చేయడం మనందరికీ తెలిసిన విషయమే. కానీ.. అలా ఒక చేతికి కాకుండా రక్తపోటును రెండు చేతుల్లోనూ కొలవాల్సిందేనని బ్రిటన్ పరిశోధకులంటున్నారు. ఇలా చేయడం వల్ల గుండె సంబంధిత జబ్బులను ముందుగానే పసిగట్టవచ్చని వారు చెబుతున్నారు.
యూనివర్సిటీ ఆఫ్ ఎక్సీటర్, పెనిన్సులా కాలేజ్ ఆఫ్ మెడిసిన్ అండ్ డెంటిస్ట్రీకి చెందిన డాక్టర్ క్రిస్టోఫర్ క్లార్క్, బృందం చెబుతున్న ప్రకారం.. రెండు చేతులకూ బీపీ చెక్ చేసినప్పుడు సిస్టోలిక్ బ్లడ్ ప్రెజర్‌లో 10ఎంఎం తేడా ఉంటే కాళ్లకు, పాదాలకు రక్తాన్ని సరఫరా చేసే నాళాలు గట్టిపడుతున్నట్టు సూచన అని వారు వివరించారు. ఈ తేడా ఉన్న వారు గుండె జబ్బులకు గురయ్యే ముప్పు అధికమని హెచ్చరించారు. ఆ తేడా 15 ఎంఎం కంటే ఎక్కువ ఉంటే మెదడుకు రక్తాన్ని సరఫరా చేసే నాళాల్లో ఇబ్బందులు ఉన్నట్టేనని తెలిపారు.
ఈ తేడా ఉందని ముందస్తుగా తెలుసుకోవడం వల్ల బాధితులకు ఆ ఇబ్బందిని అధిగమించేందుకు అవసరమైన సూచనలు చేసే అవకాశం వైద్యులకు ఉంటుంది. "నిజానికి బీపీ చెకింగ్ రెండు చేతులకూ చేయాల్సిందేనని ఇప్పటికే మార్గదర్శకాలు కూడా ఉన్నాయి. కానీ, ఎవరూ చేయట్లేదు'' అని క్రిస్టోఫర్ క్లార్క్ అన్నారు. రోగికి ధూమపానం అలవాటు ఉంటే దాన్ని మానేయడం, రక్తపోటును తగ్గించే మందులు తీసుకోవడం వంటి ముందు జాగ్రత్తలతో గుండెజబ్బుల ముప్పును నిరోధించవచ్చని వివరించారు.

0 comments:
Post a Comment