పూర్వకాలంలో ఉత్తరాలు చేరవేయడానికి పావురాలను వాడేవారు. అవి తమ గమ్యాన్ని అంత కచ్చితంగా గుర్తుంచుకోగలవు. వాటి కంటి చూపు చాలా స్పష్టంగా ఉంటుంది కూడా. వాటికి జ్ఞాపకశక్తే కాదు.. విశ్లేషణశక్తి కూడా ఉందని తాజాగా న్యూజిలాండ్ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. పావురాలు లెక్కలు చేయగలవని, వస్తువుల సంఖ్యలో తేడాలను గుర్తించగలుగుతాయని అంటున్నారు.
ఓటాగో యూనివర్సిటీకి చెందిన మానసిక శాస్త్రవేత్తలు దీనిపై పరిశోధన చేశారు. ఈ శక్తి ఇప్పటివరకూ.. మనుషులకు, మనిషితో దగ్గరి సంబంధం ఉన్న చింపాంజీలు, కోతులకే పరిమితమని ఇప్పటివరకూ అంతా భావిస్తున్నారని, కానీ కోతులకు శిక్షణ ఇచ్చినంత సులువుగానే.. పావురాలకు కూడా శిక్షణ ఇవ్వవచ్చని ఈ పరిశోధనకు నేతృత్వం వహించిన డామియన్ స్కార్ఫ్ తెలిపారు.
ఈ పరిశోధన కోసం వారు కొన్ని బొమ్మలతో కూడిన టచ్‌స్క్రీన్‌ను ఉపయోగించారు. ఒక చతురస్త్రం, రెండు త్రిభుజాలు, మూడు దీర్ఘ చతురస్త్రాలు ఇలా ఆ స్క్రీన్‌పై ఉంచి చూపించారు. ఆ తరువాత వాటిని ఒకటి తర్వాత మూడు, ఆ తర్వాత రెండు ఇలా గజిబిజిగా చూపించారు. తక్కువ సంఖ్య నుంచి ఎక్కువ సంఖ్య ఉన్న వాటిని వరుసగా గుర్తిస్తే వాటికి ఆహారాన్ని బహుమతిగా ఇస్తూ వచ్చారు. అలా కొద్ది రోజుల్లోనే పావురాలు తొమ్మిది సంఖ్య బొమ్మల దాకా వరుసగా గుర్తించగలిగాయి. అదీ వాటికున్న శక్తి!

0 comments:
Post a Comment