Monday

సోషల్ సైట్లపై ఎఫ్‌బీ'ఐ'



 ఆన్‌లైన్ సమాచార స్వేచ్ఛపై మరో ఉక్కుపాదం! ఈసారి మోపుతున్నది అమెరికన్ నిఘా సంస్థ.. ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్‌బీఐ). సోషల్ నెట్‌వర్కింగ్ సైట్లపై నిఘా పెట్టేందుకు అవసరమైన సాఫ్ట్‌వేర్‌ను రూపొందించే యత్నాల్లో నిమగ్నమై ఉంది. గూగుల్, ఫేస్‌బుక్, ట్విట్టర్ వంటి సైట్లలో.. అనుమానించదగ్గ పదాలు, వాక్యాలూ, వ్యక్తుల కదలికలను పసిగట్టే సాఫ్ట్‌వేర్‌ను తయారుచేసి పెట్టాల్సిందిగా సాంకేతిక నిపుణులను, టెక్ దిగ్గజ కంపెనీలనూ కోరుతోంది. ఈ సాఫ్ట్‌వేర్ ఒక్క ఆంగ్ల పదాలనే కాదు, ఫ్రెంచ్, ఇటాలియన్, జర్మన్, చైనీస్, జపనీస్ తదితర భాషల్లో ఉండే 'ప్రమాదకర' పదాలను కూడా విశ్లేషించేలా రూపొందుతున్నట్టు సమాచారం.

0 comments:

Post a Comment