Monday

లాస్ట్ బెంచీ నాకిష్టం...!


లెక్కల మాస్టారు క్లాసులో అడుగుపెడుతుంటే భయంతో నాకు ఒళ్ళంతా చెమటలు పట్టేది. ఎందుకంటే నాకు అసలు ఎక్కాలే రావు. లెక్కల్లో నేను చాలా పూర్ స్టూడెంట్‌ని. ఈ మాటలు అన్నది ఎవరో కాదు, మహాత్మాగాంధీ. తన ఆత్మకథలో ఆయనే స్వయంగా రాసుకున్నాడు. చాలా మంది పిల్లల్లా నేను కూడా వెనుక బెంచిలో కూర్చోడానికి ఇష్టపడేవాడిని. స్కూల్లో నాకు పెద్దగా స్నేహితులు లేరు. ఇంటి బెల్లు ఎప్పుడు కొడతారా అని ఎదురుచూస్తూ ఉండేవాడిని. లాస్టు బెల్లు కొట్టగానే సంచి భుజానికి తగిలించుకుని పరుగు పెట్టేవాడిని.

అయితే, నేను చాలా సన్నగా ఉంటానని టీచర్లు అందరూ నన్ను బాగా చూసేవారు. అయితే, మార్కులు మాత్రం అందరితో పాటు సమానంగానే వేసేవారు. అయితే, నేను ఎప్పుడూ తక్కువ మార్కులు తెచ్చుకొని ఇంట్లో తిట్లు తినలేదు అని తన స్కూలు జీవితం గురించి రాసుకున్నాడు గాంధీ. నేడు గాంధీ వర్థంతి.

0 comments:

Post a Comment