Monday

టీతో గుండెపోటుకు చెక్

అరె చాయ్ చటుక్కున తాగరా భాయ్!
అరె చాయ్ చమక్కులే చూడరా భాయ్!
.. చిరంజీవి సినిమాలోని పాట ఇది. 'టీ'ని పొగిడేవాళ్లు ఎంతమంది ఉన్నారో.. తెగిడేవాళ్లూ అంతే మంది ఉన్నా.. 'టీ' తాగితే మేలే ఎక్కువ అంటున్నాయి పరిశోధనలు. టీ తాగితే మంచిదన్న జాబితాకు తాజాగా మరో రెండు జత కలిశాయి. రోజుకు మూడు కప్పుల టీ తాగితే గుండెపోటు, మధుమేహం వచ్చే ప్రమాదం తగ్గుతుందని తాజా పరిశోధనలో వెల్లడైంది. ప్రతిరోజూ టీ తాగితే ధమనుల్లో రక్తం గడ్డ కట్టకుండా ఉంటుందని, రక్తపోటును నియంత్రిస్తుందని, ధమనుల్లో రక్త ప్రవాహాన్ని నియంత్రించకుండా అడ్డుకుంటుందని తేలింది. 


ప్రతిరోజూ మూడు కప్పుల టీ తాగితే గుండెపోటు వచ్చే అవకాశం 60 శాతం తగ్గుతుందని, మధుమేహ ముప్పును తగ్గిస్తుందని డాక్టర్ కర్రీ రుక్స్ట్‌న్, డాక్టర్ పమేలా మాసన్‌ల నేతృత్వంలో జరిగిన అధ్యయనంలో తేలింది. 40 పరిశోధన పత్రాలతోపాటు బ్లాక్ టీ, వ్యాధుల నియంత్రణకు సంబంధించిన సమాచారాన్ని వీరు విస్తృతంగా అధ్యయనం చేశారు. చాలా సందర్భాల్లో బ్లాక్ టీ రక్షణ ఛత్రంగా ఉపయోగపడిందని వారు గుర్తించారు. రోజుకు మూడు నుంచి ఆరు కప్పుల బ్లాక్ టీ తాగితే గుండె ఆరోగ్యం మెరుగుపడుతుందని తమ పరిశోధనల్లో తేలిందని, దీనిపై మరింత అధ్యయనం చేయాల్సి ఉందని డాక్టర్ రుక్స్టన్ చెప్పారు.

0 comments:

Post a Comment