Saturday

దేశాన్ని బట్టి సెన్సార్: ట్విట్టర్


మన కేంద్ర మంత్రి కపిల్ సిబల్ బెంగ సగం తీరినట్టే! ఇకపై తమ సైట్‌లో 'సెలెక్టివ్ సెన్సార్‌షిప్'.. అనగా ఆయా దేశాల చట్టాలను బట్టి అభ్యంతరకర సమాచారం అనుకున్నదానిపై పాక్షిక సెన్సార్ షిప్ విధిస్తామని మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విట్టర్ ప్రకటించింది. తమ సైట్లలో ఉన్న అభ్యంతరకర సమాచారం మొత్తాన్నీ ఫిబ్రవరి 6లోగా తొలగించాలంటూ గూగుల్, యాహూ, ట్విట్టర్, ఫేస్‌బుక్ తదితర 21 దిగ్గజాలకు ఢిల్లీ కోర్టు ఒకటి ఆదేశించిన నేపథ్యంలో ట్విట్టర్ నిర్ణయం సంచలనం సృష్టించింది.

అయితే.. ఇది ఒక్క భారతదేశాన్ని మాత్రమే దృష్టిలో పెట్టుకుని తీసుకున్నది కాదు. ఉదాహరణకు ఫ్రాన్సు, జర్మనీ దేశాలు నాజీ అనుకూల వ్యాఖ్యలను అభ్యంతరకర సమాచారంగా పరిగణిస్తాయి. ట్విట్టర్ 'సెలెక్టివ్ సెన్సార్‌షిప్'విధానం ప్రకారం.. ప్రపంచంలో ఏ దేశీయులైనా తమ ట్విట్టర్ ఖాతాల్లో నాజీ అనుకూల వ్యాఖ్యలు చేసినా ఆ రెండు దేశాల్లోనూ ఆ వ్యాఖ్యలు ప్రదర్శితం కావు. మిగతా ప్రపంచమంతా కనిపిస్తాయి. వినియోగదారుల వ్యాఖ్యలను నిలువరించే పక్షంలో ఆ విషయాన్ని వారికి తెలుపుతామని పేర్కొంది.

0 comments:

Post a Comment