Friday

అమెరికన్‌ వెబ్‌సైట్‌లో భారత్‌ కొత్త మ్యాప్‌...?


దేశ భౌగోళిక సరిహద్దులపై భారత్‌ దీర్ఘకాలిక వైఖరిని ప్రతిబింబించే కొత్త మ్యాప్‌ని అమెరికా విదేశాంగ శాఖ తమ వెబ్‌ సైట్‌లో వుంచింది.గతంలో జరిగిన పొరపాటు పట్ల న్యూఢిల్లీ ఆగ్రహం. నిరసన వ్యక్తం చేసింది. ''మేము పొరపాటు చేశాం. దానిని సరిచేసుకున్నాం. మేము తిరిగి మా పాత విధానానికి కట్టుబడి ముందుకు సాగుతాం'' అని విదేశాంగ శాఖ ప్రతినిధి విక్టోరియా నూలండ్‌ విలేకరులకు తెలిపారు. కొత్త, సరి చేసిన భారత్‌ చిత్ర పటాన్ని (మ్యాప్‌) విదేశాంగ శాఖ వెబ్‌సైట్‌తో పాటు పర్యాటక సంబంధ వైబ్‌సైట్లలోనూ వుంచినట్లు విలేకరుల సమావేశంలో ప్రకటించిన అనంతరం ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. జమ్మూ-కాశ్మీర్‌లోని కొన్ని ప్రాంతాలను పాకిస్తాన్‌లో భాగంగా చూపించిన పాత వివాదాస్పద మ్యాప్‌లను, భారత్‌ అభ్యంతరాలు వ్యక్తం చేసిన అనంతరం నవంబర్‌లో విదేశాంగ శాఖ తొలగించింది. జమ్మూకాశ్మీర్‌ మొత్తం తమ అంతర్భాగమని భారత్‌ వాదన. '' సవరించిన మ్యాప్‌లను మా వెబ్‌సైట్‌లో వుంచినట్లు తెలపడానికి నేను సంతోషిస్తున్నాను'' అని ఆమె పేర్కొన్నారు.
' ఈ మ్యాప్‌లను చూడగానే, అమెరికా ఈ వివాదంలో ఎవరి పక్షమూ వహించబోవడం లేదని, సమస్యను సామరస్యంగా, శాంతియుతంగా పరిష్కరించుకోవలసిందిగా అన్ని పక్షాలనూ కోరుతున్నదన్న వాస్తవాన్ని ప్రతిబింబిస్తుంది'' అని ఆమె అన్నారు.

0 comments:

Post a Comment