Monday

పాక్‌లో హిందూ బాలిక మత మార్పిడి..!


మైనర్ కుమార్తెను అపహరించి బలవంతంగా ఇస్లాం మతంలోకి మార్చి, ముస్లిం వ్యక్తికిచ్చి వివాహం చేశారని పాకిస్థాన్‌లోని కరాచీకి చెందిన మైనారిటీ హిందువులైన తల్లిదండ్రులు ఆరోపించారు. ఈ మేరకు బాగ్దాదీ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. మతమార్పిడికి ముందున్న భారతి పేరును ఆయేషాగా మా ర్చారు. కరాచీలోని ల్యారీ ప్రాంతంలో ఆడపిల్లల ను మతం మార్చి వివాహమాడుతున్న కేసుల్లో ఇది 18వదని 'ద ఎక్స్‌ప్రెస్ ట్రి బ్యూన్' పత్రిక క థనం ప్రచురించింది.

శనివారం స్థానిక కోర్టులో తన కుమార్తెకు 15ఏళ్లు మాత్రమేనని రుజువు చే సేందుకు ఆయన రిజిస్ట్రేషన్ కార్యాలయం నుం చి «ద్రువీకరణ పత్రాన్ని చూపారు. అయితే, 'ఆ యేషా' మతమార్పిడి, వివాహం సందర్భంగా ఇ చ్చిన పత్రాలపై ఆమె వయసు 18 ఏళ్లుగా ఉం ది. భారతిని వివాహమాడిన అబిద్.. నేరగాడని, మాదక ద్రవ్యాల వినియోగంతోపా టు కనిపించిన ప్రతి కన్నెపిల్లపైనా కన్ను వేస్తాడని బాలిక బంధువులు ఆరోపించారు. బాలిక కు టుంబం తరపున పాక్ మానవహక్కుల కమిషన్ వైస్ చైర్‌పర్సన్ అమర్‌నాథ్ మౌతుమల్ వాదించారు.

0 comments:

Post a Comment