వైకుంఠ ఏకాదశి మ హోత్సవాల్లో భాగంగా ఆదివారం భద్రాచలంలో ని శ్రీసీతారామచంద్రస్వామి శ్రీరామావతారంలో భక్తులకు కన్నులపండువుగా దర్శనమిచ్చారు. ఆదివారం ఉద యం మూలవరులకు పంచామృతాభిషేకాన్ని నిర్వహించారు. అనంతరం శ్రీరామవతారంలో అందంగా అలంకరించారు.
వేద పండితుల మంత్రోచ్చారణ, భాజభజంత్రీలు, కోలాటాల నడుమ స్వామివారిని మిథిలా స్టేడి యం ప్రాంగణంలోని అధ్యయనోత్సవ వేదిక వద్దకు తీసుకువచ్చారు. ఈ సమయంలో విశ్వక్సేన పూజ, పుణ్యహావచనం తదితర కార్యక్రమాలు నిర్వహించి స్వామివా రికి నివేదన చేశారు. పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులు స్వామి వారిని భక్తి ప్రపత్తులతో తిలకించి తరించారు. అనంతరం స్వామి వారిని తిరువీధి సేవకు తీసుకెళ్లారు. కల్యాణ మండపం, రాజవీధి, కోపరేటివ్ బ్యాంకు, తాతగుడి మీదుగా తిరిగి భద్రాద్రి రామాలయానికి తరలివెళ్లారు.
ఈ కార్యక్రమంలో పాలక మండలి చైర్మన్ కురిచేటి పాండురంగారావు, దేవస్థానం ఇవో కె. జ్యోతి, స్థానాచార్యులు కెఇ స్థలశాయి, ప్రధానఅర్చకులు పొడిచేటి హరిజగన్నాధా చార్యులు, ముఖ్యఅర్చకులు కోటి రామస్వరూపాచార్య, అమరవాది మురళీకృష్ణమాచార్యులు తదితరులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా నూతన ఆంగ్ల సంవత్సరాదిని పురస్కరించుకొని రాష్ట్రం నలుమూలల నుంచి వేలాది మంది భక్తులు భద్రాద్రి రామయ్యను దర్శించి ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు.

0 comments:
Post a Comment