రాష్ట్ర సమాచార హక్కు కమిషన్‌కు ప్రభుత్వం పూర్తిస్థాయిలో కమిషనర్లను నియమించింది. ముఖ్య కమిషనర్‌తో పాటు మొత్తం పదిమందికి అవకాశం ఉం డగా.. తొమ్మిది మందికి స్థానం కల్పించింది. అం దులో ఇద్దరు మహిళలకు చోటు దక్కింది. సీఎం కిరణ్ అధ్యక్షతన మంగళవారం సచివాలయంలో జరిగిన కమిటీ సమావేశంలో ఎనిమిది మంది కమిషనర్ల పేర్లను ఖరారు చేశారు. ఈ సమావేశానికి ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు, డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ హాజరయ్యారు.
కమిషన ర్ పదవి కోసం ముగ్గురు ఐఏఎస్‌లు ఆర్ఎం గోనె ల, పి.సుందరకుమార్, డిఆర్ గార్గ్ యత్నించినా.. ప్రభుత్వం వారికి మొండిచేయి చూపింది. కమిషనర్లుగా చోటు దక్కిన వారిలో అవంతి విద్యాసంస్థ అ ధినేత శ్రీనివాస్ సోదరి ఎస్.విజయనిర్మల, మాజీ మంత్రి కోనేరు రంగారావు కుమార్తె తాంతియా కు మారి, సామాజిక కార్యకర్త వర్రె వెంకటేశ్వర్లు, విజయబాబు (సీనియర్ జర్నలిస్టు)ఉన్నారు.
మాజీ ఐపీఎస్‌లు ప్రభాకర్‌రెడ్డి, ఎం.రతన్.. రిటైర్డ్ ఐఎఫ్ఎస్ మధుకర్‌రాజ్‌లకు అవకాశం దక్కింది. రాజకీయ పార్టీల తరపు న ఇంతియాజ్ అహ్మద్‌ను ప్రభుత్వం ఖరారు చేసింది. కమిషనర్ల నియామకాల్లో అన్ని రకాల సామాజిక, ప్రాంతీయ సమతుల్యతను పాటించినట్లు సీఎంవో పేర్కొంది. సమాచార కమిషనర్ పదవుల కోసం 153 మంది దరఖాస్తు చేశారు.
సమాచార కమిషనర్లు వీరే!
మధుకర్‌రాజు: ఆయన పశ్చిమగోదావరి జిల్లాకు చెందినవారు. ఎస్సీ (మాల) వర్గానికి చెందిన ఆయన బీఎస్సీ(ఆనర్స్) చదివారు. అటవీ శాఖలో ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్‌గా పదవీ విరమణ పొందారు. ఎస్.ప్రభాకర్‌రెడ్డి: ఈయన మెదక్ జిల్లాకు చెందినవారు. సైబరాబాద్ కమిషనర్‌గా పని చేసి రిటైరయ్యారు.
పి.విజయ్‌బాబు: కృష్ణా జిల్లాకు చెందిన విజయ్‌బాబు ఆంధ్రప్రభ దినపత్రిక ఎడిట ర్. ఎంఏ(పొలిటికల్ సైన్స్) చదివారు. ఆ యన ఓసీ (కాపు) వర్గానికి చెందిన వారు.
వర్రె వెంకటేశ్వర్లు: నల్లగొండ జిల్లాకు చెందిన వెంకటేశ్వర్లు ఎంబీయే, ఎల్ఎల్ ఎం, పిీహెచ్‌డి చదువుకున్నారు. న్యాయవాదిగా, సామాజిక కార్యకర్తగా పనిచేస్తున్నా రు. సెంటర్ ఫర్ సస్టెయినబుల్ డెవలప్‌మె ంట్-ఎన్జీవో సంస్థకు వ్యవస్థాపక అధ్యక్షు డు. బీసీ(యాదవ) వర్గానికి చెందిన వారు.
లామ్ తాంతియాకుమారి: తాంతియా కుమారి కృష్ణా జిల్లాకు చెందినవారు. ఎంఏ, ఎల్ఎల్‌బి చదువుకున్న ఆమె హైకోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తున్నారు. ఎస్‌సి (మాదిగ) వర్గానికి చెందిన వారు.
ఎస్.ఇంతియాజ్ అహ్మద్: సీఎం సొంత నియోజకవర్గం చిత్తూరు జిల్లా పీలేరుకు చెందినవారు. బీఎస్సీ, ఎల్ఎల్ఎం, చదువుకున్నారు. 1989-2004 మధ్యకాలంలో 15 ఏళ్ల పాటు సీనియర్ సివిల్ జడ్జిగా పనిచేశారు. ముస్లిం కమ్యూనిటీ.
ఎం.విజయనిర్మల: కృష్ణా జిల్లాకు చెందిన విజయ నిర్మల ప్రస్తుతం.. ఇంటర్మీడియట్ బోర్డు మెంబర్‌గా, ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం సెనేట్ మెంబర్‌గా ఉన్నారు. ఎంకాం, ఎంఏ, ఎంబీఏ, ఎంఫిల్ పూర్తి చేశారు. ప్రస్తుతం పీహెచ్‌డి చేస్తున్నారు. కాపు కులానికి చెందిన వారు.
ఎం.రతన్: వరంగల్ జిల్లాకు చెందిన రతన్.. విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ జనరల్‌గానూ, ఎక్స్ అఫీషియో మెంబర్ ప్రిన్సిపల్ సెక్రెటరీ టు గవర్నమెంట్‌గానూ పనిచేశారు. ఉప్పర కులానికి చెందినవారు.
మహిళలకు చోటు కల్పించడం అభినందనీయం..
సమాచార కమిషన్‌లో తొలిసారిగా ఇద్ద రు మహిళలకు చోటు కల్పించడంపై రాష్ట్ర స మాచార హక్కు సంఘం హర ్షం వ్యక్తం చేసిం ది. ఈ సందర్భంగా ఆ సంఘం అధ్యక్షుడు గంగాధర్ ముఖ్యమంత్రి కిరణ్‌కు అభినందనలు తెలిపారు. దీంతో కేసులు సత్వరం పరిష్కారమవుతాయని పేర్కొన్నారు.
ఐపీఎస్ రతన్ వీఆర్ఎస్
హైదరాబాద్, జనవరి 31 : సీనియర్ ఐపీఎస్ అధికారి విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ జనరల్‌గా పనిచేస్తున్న ఎం.రతన్ స్వచ్ఛంద పదవీ విరమణ చేయనున్నారు. తాజాగా ఆయనను ప్రభుత్వం సమాచార హక్కు కమిషనర్‌గా నియమించడంతో ఐపీఎస్‌కు పదవీ విరమణ చేయాలని నిర్ణయించారు. ఆయన పదవీకాలం ఈ ఏడాది ఏప్రిల్ నెలాఖరు వరకూ ఉంది. పది రోజుల్లోపే ఈ ప్రక్రియను పూర్తి చేయనున్నారు. సమాచార హక్కు చట్టం కమిషనర్‌గా రతన్ ఐదేళ్ళ పాటు కొనసాగునున్నారు.

0 comments:
Post a Comment