దేశ చరిత్రలోనే అత్యంత ఖరీదైన సైనిక ఒప్పందం కుదిరింది. భారత సైన్యానికి 126 ఫైటర్ జెట్ విమానాలను సరఫరా చేసే కాంట్రాక్టు డసాల్ట్ అనే ఫ్రెంచి కంపెనీకి దక్కింది. ఈ కాంట్రాక్టు విలువ అక్షరాలా 51,376 కోట్ల రూపాయలు!! తాము ఉత్పత్తి చేసే 'రఫాల్' మల్టీ రోల్ జెట్ విమానాలను ఈ సంస్థ మన దేశానికి సరఫరా చేస్తుంది. యూరోఫైటర్ కన్సార్షియం నుంచి గట్టిపోటీ ఎదుర్కొని మరీ ఈ ఫ్రెంచి సంస్థ కాంట్రాక్టును దక్కించుకుంది. ఈ కాంట్రాక్టు విషయం నాలుగేళ్లుగా నలుగుతోంది. చివరిదశలో నిలిచిన రెండు కంపెనీలలో డసాల్ట్ మాత్రమే తక్కువ మొత్తానికి బిడ్ వేయడంతో దానికే అవకాశం దక్కింది.
అమెరికాకు చెందిన బోయింగ్, లాక్‌హీడ్ మార్టిన్ సంస్థలను ఈనెల ఏప్రిల్‌లో భారత్ పోటీనుంచి తప్పించి అమెరికాకు తీవ్ర ఆశాభంగం కలిగించింది. వీటితో పాటు స్వీడన్‌కు చెందిన సాబ్ ఏబీ, రష్యాకు చెందిన మిగ్ 35 కూడా రేసులోంచి జారిపోయాయి. స్వతంత్ర భారతదేశ చరిత్రలోనే ఇది అత్యంత ఖరీదైన సైనిక ఒప్పందం. ఇంతకుముందు బోయింగ్ సంస్థ సి-17 గ్లోబ్‌మాస్టర్ 3 రవాణా విమానాలను సరఫరా చేసే ఒప్పందం ఒకటి కుదిరింది. దాని విలువ రూ.28,652 కోట్లు.
విమానం వివరాలివీ..
డసాల్ట్ ఏవియేషన్ సంస్థ ఉత్పత్తి చేస్తున్న 'రఫాల్' అనేది రెండు ఇంజన్ల డెల్టా వింగ్ మల్టీ రోల్ జెట్ ఫైటర్ విమానం. దీన్ని భూతలంతో పాటు సముద్రం నుంచి చేసే యుద్ధాలకు కూడా ఉపయోగించొచ్చు. ఫ్రెంచి వైమానిక దళంతో పాటు అక్కడి నావికాదళం కూడా వీటిని ఉపయోగిస్తోంది. రఫాల్‌లో థేల్స్ ఆర్‌బీఈ2 పాసివ్ ఎలక్ట్రానికల్లీ స్కాన్డ్ మల్టీ మోడ్ రాడార్ ఉంటుంది. ఇది గాల్లోంచి వచ్చే ప్రమాదాలను గుర్తించడంతో పాటు దూరశ్రేణి ప్రమాదాలనూ పసిగడుతుంది. భూతలం మీద కనపడే లక్ష్యాలను అత్యధిక రిజల్యూషన్‌తో మ్యాప్‌లుగా అప్పటికప్పుడు సిద్ధంచేసి పైలట్లకు అందిస్తుంది.

0 comments:
Post a Comment