Wednesday

నిలదీసే గళమే.. ఈ ఏటి మేటి ప్రకటించిన టైమ్ మేగజైన్


'ద ప్రొటెస్టర్'ను 2011 పర్సన్ ఆఫ్ ద ఇయర్‌గా టైమ్ మేగజైన్ ప్రకటించింది. జన లోక్‌పాల్ కోసం నినదిస్తున్న అన్నాహజారే నుంచి ట్యునీసియాలో ని యంత బెన్అలీ దురంతాలకు వ్యతిరేకంగా గళమెత్తి ప్రాణాలు తీసుకున్న మహ్మద్ బౌజీజీ దాకా .. సామాన్యుల కోసం నిలిచిన ప్రతి వ్యక్తీ ఈ ఏటి వ్యక్తేనని ఆ పత్రిక వివరించింది. బౌజీజీ ఆత్మాహుతి అరబ్ వసంతానికి స్ఫూర్తినిచ్చిందని, ఆ సెగ ప్రపంచం మొత్తానికీ పాకి అమెరికాలో 'ఆక్యుపై వాల్‌స్ట్రీట్' ఉద్యమానికి, మాస్కో, గ్రీస్.. ఇలా పలు దేశాల్లో నిరసనలకు కారణమవుతోందని విశ్లేషించింది. ఇలా వివిధ దేశాల్లో నిరసన తెలిపిన 30 మంది నిరసనకారుల చిత్రాలతో సహా వారి గురించి ముఖచిత్రకథనంలో వివరించింది. 
టైమ్ పత్రిక పేర్కొన్న 30 మందిలో మన అన్నాహజారే కూడా ఉన్నారు. చాలా చోట్ల నిరసనకారుల్లో అత్యధికులు యువతీయువకులు, మధ్యతరగతికి చెందినవారు, విద్యాధికులు కావడం గమనార్హమని టైమ్ పేర్కొంది. ఈ ఉద్యమాలు అతి తక్కువ సమయంలో విస్తృతంగా, శరవేగంగా వ్యాపించడంలో ఇంటర్‌నెట్ పాత్ర.. ముఖ్యంగా ఫేస్‌బుక్, ట్విట్టర్ వంటి సోషల్ నెట్‌వర్కింగ్ సైట్ల పాత్రను టైమ్ పత్రిక ప్రత్యేకంగా ప్రస్తావించింది. కాగా, ఈ ఏటి మేటి వ్యక్తుల పోటీలో ఒసామా బిన్‌లాడెన్‌పై జరిపిన ఆపరేషన్ అబొత్తాబాద్ కమాండర్ అడ్మిరల్ విలియం మెక్‌రావెన్, చైనీస్ ఉద్యమకారుడు అ వీ వీ, ప్రిన్స్ విలియమ్స్ జీవిత భాగస్వామి కేట్ మిడిల్‌టన్ తదితరులున్నారు.

0 comments:

Post a Comment