తక్కువ దూరం లక్ష్యాలను చేధించే క్షిపణి పరీక్షను ఉత్తర కొరియా జరిపినట్లు యెన్‌హాప్ వార్తాసంస్థ పేర్కొంది. కాగా సోమవారం ఉత్తర కొరియా నేత కిమ్‌జాంగ్ మరణించినట్లు ప్రకటించిన రోజే ఈ పరీక్ష జరగడం గమనార్హం. అయితే క్షిపణి పరీక్షను సోమవారం ఉత్తర కొరియా మిలటరీ అధికారులు ధవీకరించనప్పటికీ, తూర్పు తీరప్రాంతంలో క్షిపణి పరీక్ష జరిగినట్లు పేరు వెల్లడించేందుకు ఇష్టపడని ప్రభుత్వ అధికారులు పేర్కొన్నట్లు యెన్‌హాప్ తెలిపింది. కాగా అణ్వాయుధాల తయారీపై స్థిరత్వంలేని ఉత్తర కొరియా అడుగులను ప్రపంచ దేశాలు నిశితంగా గమనిస్తున్నాయి.
0 comments:
Post a Comment