Saturday

ప్రపంచ మేధావుల్లో ప్రేమ్‌జీ, అణ్ణాలకు గుర్తింపు


విప్రో అధినేత అజీమ్‌ ప్రేమ్‌జీ, సామాజిక కార్యకర్త అణ్ణా హజారే ప్రపంచంలో అత్యున్నత స్థాయి 100 మంది మేధావుల్లో (గ్లోబల్‌ థింకర్స్‌) స్థానం సంపాదించారు. ఈ జాబితాలో  ఆరబ్‌ దేశాల్లో విప్లవానికి మూలకారకులైన వారి పేర్లు కూడా ఉన్నాయి. అమెరికా అధ్యక్షుడు బరాక్‌ ఒబామాకు 11వస్థానం  లభించింది. ఇండియా నుంచి అరుం ధతి రా§్‌ు, దీపా  నారాయణ్‌, అరవింద్‌ సుబ్ర మణియం వంటి వారి  పేర్లు కూడా ఈ జాబి తాలో ఉన్నాయి. అజీమ్‌ ప్రేమ్‌జికి 14వ స్థానం లభించింది. ఆయన పై స్థానాల్లో బిల్‌గేట్స్‌, మిలిండాగేట్స్‌ ఉన్నారు. ఫారిన్‌ పాలసీ మాగజీన్‌ ఈ జాబితాను తయారు చేసింది. అవినీతి వ్యతిరేక ఉద్యమాన్ని నడుపుతున్నందుకు హజారే పేరు జాబితాలో చోటుచేసుకుంది.

0 comments:

Post a Comment