భారతీయుడైన శాస్త్రవేత్త ఒకరు ప్రపంచంలోకెల్లా వేగంగా ఛాయాచిత్రాలను తీసే కెమేరాను కనుగొన్నారు. మస్సాచూసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి చెందిన మీడియా ప్రయోగశాలలో వాస్తవ దృశ్యాన్ని పట్టిచ్చే కెమేరాను డాక్టర్ రమేశ్‌శంకర్ అతని బృందం రూపొందించింది. ఈ కెమేరా ఒకవైపు నుంచి మరోవైపునకు కదిలే కాంతిని కూడా నమోదు చేయగలుగుతుంది.
ఈ మేరకు అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ రమేశ్‌శంకర్ 'యూ ట్యూబ్'లో వివరించారు. "తూటాల కన్నా 10లక్షలసార్లు వేగంగా కాంతికణాలు సంచరిస్తాయి. తమ కెమేరా వీటిని కూడా గ్రహిస్తుంది'' అని తెలిపారు. 'ఫెమ్‌టో ఫొటోగ్రఫీ'గా ఈ ప్రాజెక్టుకు నామకరణం చేశారు. వైద్యపరంగా తీసే ఛాయాచిత్రాలు, ఆల్ట్రాసోనిక్ చికిత్సతోపాటు పరిశ్రమల్లోనూ ఈ కెమేరాను వినియోగించవచ్చని శాస్త్రవేత్త డాక్టర్ రస్కర్ చెప్పారు.

0 comments:
Post a Comment