Monday

గ్లోబల్ ఆస్పత్రిలో అరుదైన శస్త్రచికిత్స...

దేశంలో తొలిసారిగా ఒక్క ఊపిరితిత్తి మార్పిడి ఆపరేషన్ విజయవంతంగా నిర్వహించినట్లు గ్లోబల్ హాస్పిటల్ సోమవారం ప్రకటించిం ది. ఇరాక్ రాజధాని బాగ్దాద్‌కు చెంది న కరీమ్ హమీద్ అమీన్(33) అనే ఊపిరితిత్తుల రోగికి శుక్రవారం ఆపరేషన్ చేసి ఊపిరితిత్తిని మార్చారు. మేడపై నుంచి పడి తీవ్రగాయాలతో మరణించిన నెల్లూరు జిల్లాకు చెందిన 18 ఏళ్ల యువకుడి నుంచి సేకరించిన ఊపిరితిత్తిని అమీన్ కు అమర్చినట్లు ఆస్పత్రి డాక్టర్ మధుశంకర్ తెలిపారు. రోగి ప్రస్తుతం కోలుకుంటున్నాడని తెలిపారు. ఇంతకుముందు ఇటువంటి ఆపరేషన్1986లో టొరెంటోలో డాక్టర్ జోల్ కాపర్ చేశారని, మన దేశంలో జరగడం ఇదే మొదటిసారి అని ఆయన వివరించారు.

0 comments:

Post a Comment