Tuesday

విదేశాల్లోనూ బూట్లు, చెప్పుల దాడి సంస్కృతి

AA

* బుష్‌, ముషారఫ్‌, బ్లెయిర్‌పై షూ అటాక్‌
* కొద్దిలో తప్పించుకున్న నేతలు
* షూ బాధితుల్లో ముషారఫ్‌
* అటాక్‌ నుంచి తప్పించుకున్న ముషారఫ్‌ 


నేతలపై బూట్లు, చెప్పుల దాడి జరిగిన ఘటనలు ఇక్కడే కాదు విదేశాల్లోనూ ఉన్నాయి. యూఎస్‌ ప్రెసిడెంట్‌గా ఉన్న సమయంలో జార్జ్‌ బుష్‌పై షూ అటాక్‌ జరిగింది. ముషారఫ్‌, టోనీబ్లెయిర్‌ కూడా బాధితులే. ఇరాక్‌ విషయంలో అమెరికా విధానాలకు నిరసనగా నాటి యూఎస్‌ ప్రెసిడెంట్‌ జార్జ్‌ బుష్‌పై బూటు దాడి జరిగింది. ఇరాకీ జర్నలిస్ట్‌ ముంతజర్‌ అల్‌జైదీ బుష్‌పై షూ విసిరాడు. దీంతో ప్రపంచం యావత్తూ బిత్తరపోయింది.

బ్రిటన్‌ మాజీ ప్రధాని టోనీబ్లెయిర్‌దీ ఇదే పరిస్థితి. పీఎంగా ఉన్న సమయంలో ఓ ఆకతాయి బ్లెయిర్‌పై డబ్లిన్‌లో బూటు విసిరాడు. పాకిస్థాన్‌ మాజీ అధ్యక్షుడు పర్వేజ్‌ ముషారఫ్‌ కూడా బూటు బాధితుల్లో ఒకరు. పాకిస్థాన్‌పై అమెరికా ఆంక్షలకు నిరసనగా ఓ వ్యక్తి ముషారఫ్‌పై షూ విసిరాడు.

0 comments:

Post a Comment