నూనెదీపాలు, కిరోసిన్ దీపాల వాడకం నుండి క్రమంగా విద్యుత్‌ను కనుగొన్న తర్వాత క్రమక్రమం గా దాని వినియోగం ప్రపంచవ్యాప్తంగా విస్తృత మైంది. అదేవిధంగా పలు రకాల సైజుల్లో బల్బులు రూపొందింపబడటంతో ప్రతివారు విద్యుత్ వినియోగానికి అలవాటుపడ్డారు. అయితే ప్రతిచోట విద్యుత్ బల్బులను వినియోగించడం కుదరదు. ఎందుకంటే విద్యుత్ లైన్లు, వాటికి అనుకూలంగా రహదారి మార్గ సౌకర్యాలుండాలి. ఉదాహరణకు ఇళ్ళల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయిన సమయాల్లో, లేదా విద్యుత్ సరఫరా ప్రాంతాల్లో రహదారుల గుండా ప్రయాణించడం కష్టమవుతుంది. ముఖ్యంగా అనుకోకుండా ఇళ్ళల్లో విద్యుత్ పోయిన సందర్భాల్లో ఏదైనా వస్తువును వెతకవలసి వచ్చిన సందర్భాల్లో వెలుతురు తప్పనిసరి అవుతుంది. అటువంటి సమయాల్లో వాడుకునే నిమిత్తం ప్రత్యేకంగా రూపొం దించబడిందే ఫ్లాష్ లైట్. ఇంధనం అవసరంలేని లైట్ ఇది. దీన్ని కొన్నిచోట్ల టార్చిలైట్ లేదా టార్చ్ అని, ఎలక్ట్రికల్ స్పాట్‌లైట్ అని పిలుస్తుంటారు.
దీనికి విద్యుత్‌తో సంబంధం లేదు. బ్యాటరీ సహాయంతో పనిచేస్తుంది. నేడు వచ్చే కొన్ని టార్చ్‌లైట్లు ఛార్జింగ్ చేయడం ద్వారా ఉపయో గిస్తున్నారు. తొలుత పెద్దగా ఉండే టార్చ్‌లైట్లను రూపొందించినా క్రమంగా బ్యాగుల్లో లేదా జేబులో సైతం పెట్టుకుని తీసుకువెళ్లేంత సౌకర్యంగా దీన్ని రూపొందించారు. పర్వతారోహకులు, గనుల్లో పనిచేసే వారికోసం హెల్మెట్‌లో లైట్ వుండే టార్చ్ లైట్‌ను రూపొందించారు. చేతితో పట్టుకోకుండా హెల్మెట్‌కే ఉండటం వల్ల వీరికి సౌకర్యంగా ఉంటుంది. టార్చ్‌లైట్‌ను అమెరికా, కెనడాలలో ప్లాష్‌లైట్‌గా పిలుస్తుండగా, మిగిలిన ఇతరదేశాల్లో టార్చ్ లేదా ఎలక్ట్రిక్ టార్చ్‌గా పిలుస్తారు.
1896 సంవత్సరం లో మొదటి సారిగా గట్టిగా వున్న సెల్ బ్యాటరీని దీనికోసం ఉపయో గించారు. వీటికి ముందు లిక్విడ్‌ను కలిగిన బ్యాటరీలను
ఉపయోగించే వారు. ఈ బ్యాటరీలను కొంచెం కష్టంతో తీసుకువెళ్లగలిగే సౌకర్యంవున్నా ఒక్కోసారి లిక్విడ్ ఒలికిపోవడం లేదా బ్యాటరీ క్రిందపడితే పనికి రాకుండా పోయేది. జనవరి, 1899 సంవత్సరంలో అమెరికన్ ఎలక్ట్రికల్ నావెల్టి అండ్ మాన్యు ఫ్యాక్చరింగ్ కంపెనీకి సంబంధించిన డేవిడ్ మిస్సెల్ రూపొందించిన ఎలక్ట్రిక్ పరికరానికి పేటెంట్ తీసుకున్నాడు. పేపర్ ట్యూబ్, లైట్ బల్బ్, కరకుగా వుండే ఇత్తడితో చేసిన భాగం, అద్దంను తాను తయారుచేసిన బ్యాటరీని దీనికి ఉపయోగించి ఇతను ఫ్లాష్‌లైట్‌ను రూపొందించాడు. దీన్ని ఆ కంపెనీ న్యూయార్క్ సిటీపోలీసులకు బహుమతిగా ఇచ్చింది.
ఈ సమయంలోనే జింక్-కార్బన్ బ్యాటరీలను తయారుచేయడం ప్రారంభించారు. ఇవి అనుకున్నం తగా పనిచేయలేదు. ఈ క్రమంలో కార్బన్- ఫిలమెంట్ బల్బులను దీనికై
ఉపయోగించడం ప్రారంభించారు. వీటిని ఫ్లాష్ లైట్ అని పిలిచే వారు. వీటిల్లో చిన్నవి కూడా తయారు చేయడం ప్రారంభించారు. ఆ తర్వాత ఎలక్ట్రికల్ ఫిలమెంట్ టంగ్‌స్టన్ వైర్‌ను ఉపయోగించడం ప్రారంభించారు. క్రమక్రమంగా దీనిపై మరిన్ని పరిశోధనలు జరిగాయి.
నేడు ఫ్లాష్ లైట్లను ూఱస్త్రష్ట్ర్ వఎఱ్‌్‌ఱఅస్త్ర సఱశీసవర (ూజుణర) విరివిగా ఉపయోగిస్తున్నారు. బ్యాటరీతో ఉపయోగించే వాటికి బ్యాటరీ, లైట్‌ను మార్చుకునే సౌలభ్యం వుంది. పలు సైజుల్లో బ్యాటరీల తయారీల కనుగుణంగా ఫ్లాష్‌లైట్లను రూపొందిస్తున్నారు. అలాగే బ్యాటరీ అవసరం లేకుండా ఛార్జింగ్ టార్చ్ లైట్లను కూడా తయారుచేయడం ప్రారంభించారు.
అమెరికాలోని కాలిఫోర్నియాలో 1999 సంవత్సరంలో లూమిలెడ్స్ కార్పొరేషన్ ఆఫ్ సాన్‌జోష్ వారు ూబఞవశీఅ శ్రీవస ను పరిచయం చేశారు. ఇది ఎక్కువ శక్తివంతంగా పనిచేస్తూ తెల్లని కాంతిని ప్రసరింపజేస్తుంది. ఇది గతంలో రూపొందించిన వాటికంటే చక్కగా పనిచేశాయి. ఎక్కువ శక్తిగల ూవస ప్లాష్‌లైట్లను అల్యూమినియం, ప్లాస్టిక్ పైభాగాలతో తయారుచేసి ఉపయోగించడం ప్రారంభించారు. అలాగే కొన్ని డిస్పొజబుల్ ప్లాష్‌లైట్ల తయారీ కూడా ప్రారంభించారు. బ్యాటరీలతో వాడే టార్చ్‌లైట్లతో పాటు ఛార్జింగ్‌తో వాడుకునే టార్చిలైట్ల వినియోగం నేడు ఎక్కువగా వుంది. నేడు ఈ ఫ్లాష్‌లైట్ లేదా టార్చ్ లైట్స్ అన్ని దేశాలలోని వారికి కూడా అందుబాటులో వుండటమే కాదు పిల్లలు సైతం సులభంగా, నిర్భయంగా ఉపయోగించే విధంగా తయారుకావడం దీని ప్రత్యేకత. ఛార్జింగ్‌తో పనిచేసేవి ఎక్కువకాలం వచ్చేలా రూపొందించ బడటంతో నేడు వీటి వినియోగం ఎక్కువగా ఉందనే చెప్పాలి. సోలార్‌తో నడిచే ఫ్లాష్‌లైట్లు కూడా భవిష్యత్‌లో వాడుకలోకి రావచ్చు.
0 comments:
Post a Comment