ప్రశ్న: మా అమ్మాయి ఇంటర్మీడియట్ రెండవ సంవ త్సరం చదువుతుంది. మాది చిన్న టౌను. అందరూ మెడిసిన్ సీటు కావాలంటే హైదరాబాద్, విశాఖ పట్నంలాంటి నగరాల్లో పెద్దపెద్ద కాలేజీలలో చదివించాలని సలహాలిస్తున్నారు. అలా దూరం పంపి చదివించటం మాకు ఇష్టం లేదు. మా ఆర్ధికస్తోమత కూడా అంతంత మాత్రమే. ఇంటర్ మొదటి సంవత్సరంలో 95శాతం మార్కులొ చ్చాయి. మా అమ్మాయి డాక్టర్ కావాలనే కోర్కే నెరవేరాలంటే ఏం చేయాలి? ప్రకాశ్, ఆలూరు, కర్నూలు జిల్లా
పేరున్న పెద్ద కాలేజీలలో, పెద్దనగరాలలో చదివితే సీట్లు వస్తాయని చెప్పేవారు, చేర్చేవారు, వారిమీద, వారి బిడ్డల తెలివితేటల మీద నమ్మకం లేనివారు మాత్రమే చేస్తారు. పెద్ద నగరాలలోని సంస్థలు, వివిధ ప్రాంతాలలోని తెలివిగల, తమ తెలివితేటల్ని ఎస్‌ఎస్‌సి పరీక్ష ఫలితాలలో నిరూపిం చుకున్న వారిని తీసుకెళ్లి, వారికి ఉచిత విద్యను అందించి, విద్యార్థులను రోజు క్రమం తప్పక చదివించే బాధ్యతను మాత్రమే నిర్వర్తించి, ర్యాంకులు వచ్చాక, తమ వద్ద చదివితేనే ర్యాంకులు వస్తాయని ప్రచారం చేసుకుంటారు. మీ అమ్మాయి ఇప్పటికే ఎస్‌ఎస్‌సి, ఇంటర్ ప్రథమ సంవత్సర ఫలితాలలో తన ప్రతిభను మీ ఊరిలోనే చదివి నిరూపించింది.
కాబట్టి మీ అమ్మాయి మీ ఊళ్లోనే చదివి ఎంబిబిఎస్ సీటు సంపాదించటం చాలా సులభం. అందువల్ల మీ సహకారం, తగిన విద్య నార్జించేందుకు అనువైన వాతావర్ణాన్ని కల్పిస్తే, తన మేధస్సును ఉపయోగించి తప్పక మెడిసిన్‌లో సీటు సాధిస్తుంది. తను ఆరవ తరగతి నుంచి ఇంటర్మీడి యట్ వరకు రాష్ట్ర ప్రభుత్వం సిలబస్‌తో ఉన్న బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రి పుస్తకాలలో ఏ ఒక్క అంశాన్ని వదలకుండా చదవటం, అలానే సిబిఎస్‌సి సిలబస్‌తో ఉన్న ఎన్‌సిఇఆర్‌టి పుస్తకాలు 6 నుండి 12వ తరగతి వరకు ఉన్న బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ టెక్ట్స్ పుస్తకాలను క్షుణ్ణంగా చదివి, గుర్తుంచుకోగల్గితే మెడిసిన్‌లో సీటు మీ పాప సొంతం కావటం చాలా సులువు.
ప్రశ్న: నేను ఇంటర్, ఎంసెట్ పూర్తి చేశాను. ఇంటర్‌లో 75శాతంతోను, ఎంసెట్ 12,743 ర్యాంకు వచ్చింది. ఎక్కువ మంది ఐటి బ్రాంచి తీసుకొని ఇంజనీరింగ్ పూర్తిచేసి ఉద్యోగాలు ఎక్కడా దొరకక నిరుపయోగంగా ఉన్నారు. నేను అందుకే ఐటిగాని, సిఎస్‌ఇగాని కాకుండా మరేదైనా బ్రాంచిలో ఇంజినీరింగ్ చేయాలని ఉంది. మిగిలిన బ్రాంచిలలో ఏ బ్రాంచి తీసుకుంటే మంచిది? .అనిల్‌కుమార్, సూర్యాపేట్
మీరు వాస్తవ పరిస్థితులను గుర్తించినట్లున్నారు. అందరూ ఐటి మోజు, డాలర్ల మోజులో ఐటి కంప్యూటర్ సైన్స్ బ్రాంచిలను తీసుకుంటున్నారు. కాని అంతకన్నా ఎంతో ముఖ్యమైనది ఎల్లవేళలా ఉద్యోగావకాశాలు ఉండే బ్రాంచి ఇఇఇ (ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్). ఈ బ్రాంచితో ఇంజినీరింగ్ పూర్తి చేసిన వారు ఒక్కరోజు కూడా నిరుద్యోగిగా ఉండాల్సిన అవసరం లేదు. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అవసరాలు లేని మానవ సమాజం ఉండదు. అలానే ఎలక్ట్రానిక్స్‌తో సంబంధం లేని ఆధునిక మానవుడు లేడు. సర్వకోటికి అత్యంత ఆవశ్యకమైన ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్‌ను జోడించి రూపొం దించినదే ఈ బ్రాంచి. ఎలక్ట్రిక్ లేకుండా ఎలక్ట్రానిక్స్ కూడా ఉండదు.
ఆధునిక సమాజ మనుగడ అభివృద్ధి కేవలం ఈ రెండు అంశాలపైనే ఆధారపడి ఉంది తప్ప ఐటిపైన, కంప్యూటర్‌ల పైన కాదు. కంప్యూటర్ అవసరమేకాని అన్నింటికి, అందరికి సంబంధించినది కంప్యూటర్ కాదు. కానీ ఎలక్ట్రిక్ అండ్ ఎలక్ట్రానిక్స్ అందరికి ఆవశ్యకమైన దనే విషయం గుర్తించి, తప్పక ఇఇఇ బ్రాంచి తీసుకుని శ్రద్దగా బి.టెక్ పూర్తి చేసి, విద్యుత్‌రంగ ప్రవీణుడిగా పేరుప్రఖ్యాతలు పొందే ప్రయత్నం చేయండి.
ప్రశ్న: నాకు ఫ్యాషన్ టెక్నాలజీ అంటే ఇష్టం. కాని అమ్మవాళ్లు సాధారణ డిగ్రీలు చదవమంటారు. నాకైతే అందరికి భిన్నమైన ఏదో ఒక కొత్త కోర్సును చదవాలనేది నా ఆకాంక్ష. నాకోర్కే తీరాలంటే వారిని ఎలా ఒప్పించాలి? సరైన సలహా ఇచ్చి నన్నాదుకోగలరు. జి.పావని, నంద్యాల
ఇక్కడ మీరు కొత్త కోర్సులు చేరాలనుకోవటంలో ఎలాంటి అత్యాశలేదు. అలానే మీ అమ్మవాళ్లు సాధారణ కోర్సును చదవమని, తమ బిడ్డకి రిస్క్ ఉండకూడదని కోరుకోవడంలో తప్పులేదు. అయితే కొంతసేపు మీ తల్లిదండ్రులను, వారి పాతతరం ఆలోచనలను పక్కనపెడితే, మీరు కోరుకునే కొత్తదనం, సామాజిక ప్రయోజనం, దేశ ప్రయోజ నాలకు ఉపయోగపడే విజ్ఞానాన్ని ఇచ్చేదిగా ఉండాలి. అప్పుడే మీరు కోరుకునే కొత్తదనానికి అర్ధం పరమార్ధం సాధ్యం
0 comments:
Post a Comment