Saturday

అసలు వీరబ్రహ్మేంద్రస్వామి ఎవరు?కాలజ్ఞానం అంటే ఏమిటి?వీరబ్రహ్మేంద్ర స్వామి చెప్పిందేంటి వివరించదమే ధారావాహిక లక్ష్యం.

కాలజ్ఞానం అంటే భవిషత్ దర్శనం  అనే చెప్పుకోవాలి. యోగులకు, మునులకు సాధ్యమే, మన పురాణాలలో చెప్పుకున్న వారిని వదిలేస్తే చరిత్రకు అందిన వారిలోనూ ఇలా భవిష్యదర్శనం చేసిన వారు లేకపోలేదు.
వీరిలో ప్రపంచానికి తెలిసిన ప్రముఖులు  నాస్త్రోదమాస్  అయితే తెలుగు వారికి ఎక్కువగా తెలిసింది వీరబ్రహ్మేంద్రస్వామి  ఇతర  దేశాలలోను  ఇలా భవిష్యతును  తెలుసుకుని జరగబోయేవి ముందే చెప్పిన మహనీయులు లేకపోలేదు. రష్యాలోను,టిబెట్,చైనా ,వంటి సుదీర్గ చరిత్ర కలిగి   ప్రాచీన నాగరికతలు    వెల్లివిరసి దేశాలలో కొంతమంది పేర్లు మనకు వినిపిస్తుంటాయి.కొన్ని  పుస్తకాలలో కనిపిస్తుంటాయి.కాలజ్ఞానం  ఒక విధంగా జ్యోతిష్యం అనే చెప్పుకోవాలి.జ్యోతిష్యం గ్రహగతుల ఆధారంగా కొందరు వ్యక్తుల జీవితం లో భవిష్యత్ లో జరగబోయే సంగతులను వివరించే చెప్పేది.ఈ జ్యోతిష్యం లో అనేక పద్ధతులున్నాయి.నాడి జ్యోతిష్యం,హస్త సాముద్రికం వగైరా అవిప్పుడు అప్రస్తుతం.ఇక కాలజ్ఞానం  జ్యోతిష్యానికి బిన్నమైనది.ఇది ఒక దేశ,ప్రపంచ పోకడలనే  వివరించేది.భవిష్యత్లో  సాంకేతికంగా వచ్చే మార్పులు ప్రకృతి వైపరితలకు ,దేశానికీ ఏర్పడే ముప్పులు పెను విపతులు ప్రముఖ వ్యక్తుల జననం,వారి జీవనంఇలాంటివెన్నోవివరిస్తంది.

నాస్త్రోదామాస్ వీరబ్రహ్మేంద్ర స్వామి చేసింది  సరిగ్గా ఇదే!


హిట్లర్,నెపోలియన్ వంటి ప్రముఖుల ప్రస్తావన అయన జోస్యం లో కనిపిస్తుంది.రాజీవ్  గాంధీ హత్య ప్రపంచ వానిధ్య భవన సముదాయం కూల్చివేతవంటి  సంఘటనలతో అయన జోస్యలతో కొన్నిటికి అన్వయం కుదురుతుంది మరి అయన చెప్పింది  వీరి గురించేనా? అనేది స్పష్టంగా చెప్పలేము నమ్మినవారు మాత్రం నమ్ముతునారు.
వీరబ్రహ్మేంద్ర స్వామి చెప్పింది ఇలాంటివే !నాస్త్రోదామాస్ ప్రపంచ వ్యాప్తంగా  జరిగే పరిణామాలను  దర్శించారని అయన జోతిస్యలను నమ్మినవారు భావిస్తునట్లే ,రాష్ట్రము లో అనేక సంఘటనల గురించి వీరబ్రహ్మేంద్ర స్వామికి  తెలుసుకుని ఆయన్ను నమ్మినవారు అంటారు.
ఆ జోతిస్యాలలో కొన్ని సూటిగా ఉంటే, మరికొన్ని మనమే అన్వయం కుదుర్చుకోవాల్సి వస్తుంది. జరగవలసి ఉన్న విషయాలలో "కృష్ణానది కనకదుర్గమ్మ వారి ముక్కు పుడకను అందుకుంటుంది"కృష్ణా నది ఇంద్రకీలాద్రి అంత ఎత్తుకు  చేరుకునేన్తగా ఎగసి వస్తుందా ?లేక ముక్కుపుడక నీటిని చేరుతుంద అనేది మనం  ఉహించాలేము.రెండు జరిగే అవసరం ఉందని అందరు అనుకొంటారు.
భవిష్యత్ లో జరగబోయే జలప్రలయాన్ని   మనోనేత్రంతో స్వామి దర్శించారని కొందరంటారు  జల ప్రళయమే అవసరం లేదు ఏదైనా భూకంపం లాంటి   ప్రకృతి  వైపరీత్యం వల శ్రీశైలం నాగార్జున సాగర్  ఆనకట్టలు బీటలు వారి ఎగసి వచ్చే అపర జలరాశి  చాలు కృష్ణానది ఇంద్రకీలాద్రి చేరుకుంటుంది అని అంటారు ఇక ముక్కుపుడక నీటిని చేరుకోవడం అనేది ఎవరి ఇచ్చనుసారం వారు ఉహాగానాలు చేస్తూనే ఉంటారు.

source :-
templesdiary.com

0 comments:

Post a Comment