Friday

అమెరికా వెబ్‌సైట్‌లోంచి పాక్, భారత్ తప్పుడు మ్యాప్‌లు తొలగింపు

వాషింగ్టన్: పాక్ ఆక్రమిత కాశ్మీర్ (పివోకె) భూభాగాన్ని పాకిస్తాన్‌లో అంతర్భాగంగా తప్పుగా చూపిన మ్యాప్‌లను వెబ్‌సైట్ నుంచి తొలగించినట్లు అమెరికా స్టేట్ మ్యాప్ డిపార్ట్‌మెంట్ ప్రతినిధి సోమవారం వెల్లడించారు. ‘మేం ఈ మ్యాప్‌లను (తప్పుగా చూపిన భారతదేశం) వెబ్‌సైట్‌లో తొలగించాం. కొన్ని భౌగోళిక సరిహద్దుల విషయంలో తేడాలు వచ్చాయి’ అని స్టేట్ డిపార్ట్‌మెంట్ అధికార ప్రతినిధి విక్టోరియా న్యూల్యాండ్ విలేఖరుల సమావేశంలో చెప్పారు.
‘అవి తప్పుగా ఉన్నాయి. వాటిని సరిగా చిత్రీకరించలేదు’అని ఆమె ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.‘వాటిని సరిచేసి సరిగా ఉన్నాయని భావించిన తర్వాత మేం వాటిని వెబ్‌సైట్‌లో ఉంచుతాం’అని తెలిపారు. అయితే ఖచ్చితమైన మ్యాప్‌లు ఎక్కడ నుంచి తీసుకుంటారన్న దానికి ఆమె సరిగా సమాధానం చెప్పలేదు. ‘ఇది కావాలని చేసినది కాదు. అనుకోకుండా జరిగిన తప్పిదం. ఈ మ్యాప్ సరిగా లేదని భారతదేశానికి చెందిన దినపత్రిక ఒకటి గమనించి ఆ వార్తను ప్రచురించింది. దీనిపై భారత ప్రభుత్వం తన తీవ్రనిరసనను వ్యక్తం చేసింది.

0 comments:

Post a Comment