అంగారకుడిపై గాలుల తీవ్రతకు ఏకంగా ఇసుక దిబ్బలే కదిలిపోతున్నట్లుగా శాస్త్రవేత్తలు గుర్తించారు. ఆ గ్రహంపై తరచూ పెనుగాలులు వీస్తాయని, వాటి ప్రభావం వల్ల అక్కడి నేల ఉపరితలం ప్రభావితం అవుతుందనే విషయం ఇప్పటికే తెలుసని నాసా శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కానీ, ఏకంగా ఇసుక దిబ్బలను కదిలించేంత తీవ్రంగా ఉంటాయని గుర్తించడం ఇదే మొదటిసారని పేర్కొన్నారు. భూమి మీది కంటే అంగారకుడిపై వాతావరణం తేలికగా ఉంటుంది. అంతేగాకుండా ఇసుక బరువు, పరిమాణం కూడా ఎక్కువగా ఉంటాయి. అయితే.. భూమి మీద ఇసుక రేణువులను కదిలించాలంటే.. గాలి వేగం గంటకు 16 కిమీ ఉంటే సరిపోతుంది. అదే అంగారకుడిపై అయితే దాదాపు 130 కిలోమీటర్ల కన్నా వేగంగా వీయాల్సి ఉంటుంది.
"నాసా ప్రయోగించిన మార్స్ రీకొన్నియేసన్స్ ఆర్బిటర్ పంపిన అంగారకుడి ఉపరితల చిత్రాలను పరిశీలించగా.. పెనుగాలుల ప్రభావంతో అక్కడి నేలపై ఇసుక దిబ్బలు తరలిపోతున్నట్లు తెలిసింది. కొన్ని సమయాల్లో ఇసుక దిబ్బలు ఒకేసారి కొన్ని మీటర్ల దూరం కదిలిపోతున్నాయి. ఇప్పటి వరకు అంగారకుడి నేలపై మట్టి, ఇసుక స్థిరంగా ఉంటాయని భావిస్తూ వచ్చాం. కానీ, అక్కడి ఒక ప్రాంతంలోని ఇసుక మరో ప్రాంతానికి తరలిపోవచ్చనే విషయం బయటపడింది'' అని జాన్ హాప్కిన్స్ యూనివర్సిటీ ఖగోళ పరిశోధకుడు నాథన్ బ్రిడ్జ్ తెలిపారు. అయితే.. అంగారకుడిపై అన్ని ప్రాంతాల్లో అలా గాలులు వీయవని, ఆయా ప్రాంతాల్లో ఇసుక కదలదని చెప్పారు.

0 comments:
Post a Comment