Friday

9.01%కి తగ్గిన ఆహార ద్రవ్యోల్బణం...


న్యూఢిల్లీ, నవంబరు 24 :- నవంబరు 12తో ముగిసిన వారంలో ఆహారద్రవ్యోల్బణం 9.01 శాతానికి చేరింది. బంగాళాదుంపలు, ఉల్లిపాయలు, గోధుమలు తప్ప ఇతర వ్యవసాయోత్పత్తుల ధరలు పెరుగుతున్నప్పటికీ ఆహారద్రవ్యోల్బణం స్వల్పంగా తగ్గింది. అంతకుముందు వారం ఇది 10.63 శాతం వుంది. గత సంవత్సరంతతో పోలిస్తే ఆహారోత్పత్తుల ధరలు ఇదే వారంలో 11.38 శాతం పెరిగాయి. ప్రభుత్వం విడుదల చేసిన గణాంకాల ప్రకారం ఉల్లిపాయల ధరలు 32.85 శాతం, బంగాళా దుంపల శాతం 7.23 శాతం, గోధుమల ధరలు 3.09 శాతం తగ్గాయి. అయితే ఇతర ఆహారోత్పత్తుల ధరలు గత సంవత్సరంతో పోలిస్తే పెరిగాయి. కూరగాయల ధరలు 17.66 శాతం, పప్పుధాన్యాల ధరలు 14.28 శాతం, పాలధరలు 10.46 శాతం, కోడిగ్రుడ్లు, మాంసం, చేపల ధరలు 11.98 శాతం పెరిగాయి. పండ్ల ధరలు 4.59 శాతం, కాయధాన్యాల ధరలు 2.68 శాతం పెరిగాయి. ప్రాథమిక వస్తువుల ద్రవ్యోల్బణం ఈ వారంలో 9.08 శాతానికి చేరింది. అంతకుముందు వారం ఇది 10.39 శాతం వద్ద వుంది. టోకుధరల సూచి నిర్ణయంలో ప్రాధమిక వస్తువుల వాటా 20 శాతం మేర వుంది. నూనెగింజలు, నార వస్తువులు, లోహాలు, ద్రవ్యోల్బణం ఈ వారంలో 4.05 శాతం  పెరిగింది. నవంబరు అయిదుతో ముగిసిన వారంలో ఇది 5.33 శాతం పెరిగింది. ఇంధనం, విద్యుత్‌ ద్రవ్యోల్బణం నవంబరు 12తో ముగిసిన వారంలో అంతకు ముందు సంవత్సరంతో పోలిస్తే 15.49 శాతం పెరిగింది.
ద్రవ్యోల్బణం తగ్గుతుంది : ప్రణబ్‌
ఆహారం ఇంధనాల ధరలు ధోరణి ఇలాగే కొనసాగితే  రానున్న కాలంలో ద్రవ్యోల్బణం తగ్గుతుందని గురువారం నాడు ఆర్థిక మంత్రి ప్రణబ్‌ ముఖర్జీ విశ్వాసం వ్యక్తం చేసారు. రానున్న రెండు వారాలలో ఆహార ద్రవ్యోల్బణం తగ్గుతుందనీ, నవంబరు మొత్తం మీద సరాసరి ద్రవ్యోల్బణం తగ్గుముఖంలో వుంటుం దని ఆయన విశ్వాసం వ్యక్తం చేసారు. అక్టో బరులో  టోకు ధరల ద్రవ్యోల్బణం తొమ్మిది శాతం దగ్గరగా వుంది. 11 నెలలుగా ఈ ద్రవ్యో ల్బణం తొమ్మిది శాతానికి దిగువకు రావడం లేదు. 2010 మార్చి తరువాత పలుమార్లు కీలక వడ్డీరేట్లు పెంచినప్పటికీ ఆహార ద్రవ్యోల్బణం తగ్గటం లేదు. దీనితో ప్రభుత్వం తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నది. పార్ల మెంటులో కూడా ధరల మీద సమాధానం చెప్పలేక సమస్యల వలయంలో ఇరుక్కున్నది.

0 comments:

Post a Comment