Sunday

బ్రిటన్ లో మూడో స్థానంలో భారత 'అమ్మలు'


బ్రిటన్ లో పురుడు పోసుకుంటున్న చిన్నారులకు సంబంధించి భారతీయులకు ఆసక్తిని కలిగించే ఓ విషయం ఇటీవల వెలుగు చూసింది. గత ఏడాది బ్రిటన్ లో 1 లక్షా 84 వేల మంది చిన్నారులు జన్మించగా అందులో 15 వేలకు పైగా పిల్లలు భారతీయ మహిళలకు జన్మించడం విశేషం. మొత్తం మంది చిన్నారులను పరిశీలిస్తే జన్మనిచ్చిన మాతృమూర్తులను దేశాల వారీగా విభజించగా భారతదేశానికి చెందిన అమ్మలు మూడో స్థానాన్ని పొందడం.. బ్రిటన్ లో భారతీయుల ఆధిపత్యాన్ని స్పష్టం చేస్తోంది. 

విదేశాల్లో జన్మించి.. ప్రస్తుతం బ్రిటన్ లో స్థిరపడిన తల్లుల గురించి నిర్వహించిన ఈ సర్వేలో పోలండ్ మహిళలు ప్రథమ స్థానాన్ని ఆక్రమించగా తరువాతి స్థానాల్లో పాకిస్తాన్, భారత్, బంగ్లాదేశ్, నైజీరియా, సోమాలియా, జెర్మనీ, లూథియానా, చైనా, దక్షిణాఫ్రికా దేశాలకు చెందిన మహిళలు నిలిచారని డైలీ మెయిల్ వెల్లడించింది. బ్రిటన్ ప్రభుత్వం కూడా ఈ విషయాలను ధ్రువీకరించింది. 

అధికారిక లెక్కల ప్రకారం పోలండ్ దేశస్తులైన 20 వేల మంది మహిళలు, పాకిస్తాన్ కు చెందిన 18 వేల మంది మహిళలు కూడా తమ పిల్లలకు ఇటీవల బ్రిటన్ లో జన్మనిచ్చారు. మరోవైపు ప్రతి ఏటా విదేశీ సంతతికి చెందిన మహిళలు కూడా తమ బిడ్డలకు జన్మినిస్తున్న వారి సంఖ్య పెరుగుతూ వస్తోంది. ముప్ఫయ్యేళ్ల క్రితం దేశంలో ఉన్న విదేశీ 'అమ్మ'ల కంటే ప్రస్తుతం వారి సంఖ్య రెట్టింపుకు చేరింది.

0 comments:

Post a Comment