Sunday

‘ఉద్యోగుల వైద్యం’..కార్పొరేట్‌కు నైవేద్యం...!



కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు వెైద్యం అందించ డ మంటే కార్పొరేట్‌ ఆసుపత్రులకు పం డగే. వారికి ఇష్టమైన బిల్లులు వేసుకోవ చ్చు. నకిలీ బిల్లులతో లక్షలకు లక్షలు కొ ట్టేయవచ్చు. అప్పనంగా ప్రభుత్వ సొ మ్మును దిగమింగవచ్చు. అందుకే తమ ఆసుపత్రుల్లో సీజీహెచ్‌ఎస్‌ సౌకర్యం ఉం దంటూ భారీగా ప్రచారం చేసుకుని మరీ పేషెంట్లను రారమ్మని కార్పొరేట్‌ ఆసుప త్రులు ఆహ్వానిస్తున్నాయి. ఉద్యోగుల కు రీయింబర్స్‌మెంట్‌ సౌకర్యం ఉందం టూ బురిడీ కొట్టిస్తున్నాయి. లక్షలకు లక్షల బిల్లులను అప్పనంగా సొమ్ము చేసుకుం టున్నాయి. రాష్ట్రంలోని కార్పొరేట్‌ ఆసు పత్రు ల్లో సీజీహెచ్‌ఎస్‌ కేసుల్లో భారీగా అవకతవకలు జరిగాయన్న విజిలెన్స్‌ ఎన్‌ ఫోర్స్‌మెంట్‌ ఫిర్యాదులపెై హైదరాబా ద్‌లోని మూడు కార్పొరేట్‌ ఆసుపత్రుల్లో సీబీఐ అధికారులు దాడులు నిర్వహించి పలు కీలక పత్రాలను సొంతం చేసుకున్నా ఇంతవరకు వాటిపెై ఎలాం టి చర్యలు తీసుకున్న దాఖలాలు లేకపోవడం గమనార్హం.

ప్రజా ప్రతినిధుల అండ ఉంటే ఇలాంటి కేసులేవీ తమకు అడ్డుకావన్న ధీమా తో వారు తమ పని కానిచ్చేస్తున్నారు. తమ పలుకుబడిని ఉపయోగించి సిబిఐ విచారణ వేగవంతం కాకుండా ఇప్పటికే కార్పొరేట్‌ ఆసుపత్రుల యాజమాన్యాలు పావులు కదిపిన ట్లు సమాచారం. సీబీఐ అధికారులు కార్పొరే ట్‌ ఆసుపత్రుల అవకతవకలపెై విచారణలతో సరిపెట్టి చర్యలు తీసుకోలేదు. చిన్న చిన్న కేసు ల్లో తమ ప్రతాపం చూపుతున్న స్రీబీఐ ప్రజా రోగ్యంతో చెలగాటమాడుతున్న కార్పొరేట్‌ ఆసుపత్రుల నిర్వాకంపెై దృష్టి చూపకపోవడం పెైనా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రధానం గా గుండె మార్పిడి, కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్‌, కేన్సర్‌, లివర్‌ ట్రాన్స్‌ప్లాంటేషన్‌ వంటి కేసుల్లో ఎక్కువగా నిధుల గోల్‌మాల్‌ జరిగినట్లు తెలుస్తోంది. చిన్న ఆపరేషన్లను నిర్వహించిన ప్పటికీ లక్షల రూపాయల్లో బిల్లులను వసూలు చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. 

వెైద్య పరికరాల్లోనూ గోల్‌మాల్‌
గుండెకు సంబంధించిన శస్తచ్రికిత్సలను నిర్వహించిన సమయంలో రోగులకు అవస రం లేకున్నా స్టెంట్లను వేసి బిల్లులు వసూలు చేసిన ఆరోపణలు సైతం కార్పొరేట్‌ ఆసుపత్రులపెై ఉన్నాయి. విదేశాల నుంచి దిగుమతి చేసుకుని మరీ రోగులకు అందిస్తున్నామన్న కారణం చూపి మరింత అదనంగా సొమ్ము చేసుకుంటున్నాయి. వాస్తవంగా నాసిరకం స్టంట్స్‌ను ఆరోగ్య శ్రీ రోగులకు వేస్తున్నారన్న ఆరోపణలు సైతం ఉన్నాయి. ఒక్కసారి ఆసుపత్రికి రోగి వచ్చిన తరువాత తిరిగి ఇంటికి వెళ్లే వరకూ వారి ఆధీనంలో వారు చెప్పినట్లు తలూపాల్సిన పరిస్థితి ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొంది. 

ఆసుపత్రుల్లో ప్రైవేటు ఏజెంట్లు
కేంద్రప్రభుత్వ, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులను రప్పించుకోవడానికి పలు కార్పొరేట్‌ ఆసుపత్రులు ప్రైవేటు ఏజెంట్లను ఏర్పాటు చేసుకుంటున్నాయి. వారు తమ ఆసుపత్రుల కు ఎన్ని కేసులు తీసుకువస్తే వాటిని లెక్కకట్టి మరీ వారికి కమీషన్లు అందిస్తున్నాయి. హైదరాబాద్‌ తోపాటు విజయవాడ, విశాఖప ట్నం, తిరుపతి, వరంగల్‌ వంటి ప్రధాన నగరాల్లో సైతం వీరు తమ కార్యకలాపాలకు నిర్వహిస్తున్నారు. భారీగా ప్రచారం చేస్తూ ప్రభుత్వ ఉద్యోగులకు వెైద్యం అంటూ వారిని ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నాయి. ఈ తతంగంపెై సీబీఐ ఇప్పటికైనా దృష్టి సారించి వారి ఆగడాలకు చెక్‌ పెట్టాలన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

0 comments:

Post a Comment