బైపాస్ సర్జరీతో వారిని ఇబ్బంది పెట్టడం కన్నా ఇంటర్‌వెన్షనల్ కార్డియాలజీలో మణికట్టు ద్వారా కేథటార్‌ను పంపి చికిత్సని చేస్తున్నాం’ అన్నారు హైదరాబాద్ గ్లోబల్ హాస్పిటల్ నుంచి ఒక క్లిష్టమైన యాంజియోప్లాస్టీ స్టెంటింగ్ కేసుని దిగ్విజయంగా అంతర్జాతీయ సదస్సుకి చూపించిన అనంతరం డాక్టర్ రవికుమార్ ఆలూరి.శస్త్ర చికిత్సలో ఎక్కువ కోతలతో రక్తస్రావం అధికం. ఒక్కోసారి కుట్లు వేసిన ప్రాంతం ఇబ్బంది పెడుతుంది. నయంకావడానికి సమయం పడుతుంది. అందుకే వైద్యరంగం అభివృద్ధితో క్రమంగా తక్కువ కోతల చికిత్సలు, కీ హోల్ శస్తచ్రికిత్సలాంటివి ప్రాముఖ్య తని సంతరించుకున్నాయి. వాటితో పాటు శరీరంలోకి కేథటార్‌ని పంపించి రక్తనాళాలలోని అడ్డంకుల్ని తొలగించే ఇంటర్‌వెన్షనల్ కూడా కార్డీయాలజీ ఎంతో అభివృద్ధిని సాధిస్తోంది.
ఇంతకు ముందు శస్త్ర చికిత్సలు చేసి గుండె రక్తనాళాలలోని కొన్ని అడ్డంకులు తొలగించేవారు. ఇప్పుడు యాంజియో ద్వారా చికిత్సలు కొన్ని చేస్తున్నారు. అంటే క్లిష్టతరమైన యాంజియోలు ఇప్పుడు శస్తచ్రికిత్స లేకుండా చేస్తున్నారు. క్లిష్టతర యాంజియోలు అంటే గుండె రక్తనాళాలలోని ఎడమ పక్క రక్తనాళాలలో అడ్డంకులు (బ్లాక్స్) వచ్చినా, రక్తనాళాలు చీలే చోట అడ్డంకుల్ని తొలగించి స్టెంట్‌లు పట్టడం. మూడు సంవత్సరాలకు పైగా బ్లాక్స్ ఉండి అవి పూర్తిగా రక్తనాళాన్ని మూసివేసి గట్టిగా మారినా, అలాగే హార్ట్ ఎటాక్ వచ్చినా తరువాత స్టెంట్‌లు వేయాల్సి వచ్చినా, బైపాస్ సర్జరీ గ్రాఫ్ట్ ప్రాంతాలలో అడ్డంకులు వచ్చినా ఇవన్నీ క్లిష్టతరమైన యాంజియోలు.
వీటిలో కొన్నింటికి ఇంత వరకు శస్తచ్రికిత్స ఒక్కటేమార్గం. ఇప్పుడు వీటిని కాంప్లెక్స్ (క్లిష్టతరమైన) యాంజియో ద్వారా చేతిమణికట్టు ద్వారా కేథటార్ గుండె రక్తనాళాలలోకి పంపి అడ్డంకుల్ని తొలగించి స్టంట్లను వేస్తున్నారు. ఈ యాంజియోప్లాస్టీ కూడా ఇంతకు ముందు తొగలోని రక్తనాళాల ద్వారా చేసేవారు. దీనివల్ల రోగి కదలకుండా పడుకోవలసిన అవసరం ఉండేది. రక్తస్రావం ఎక్కువ అవుతంది. హాస్పిటల్‌లో ఎక్కువ రోజులు ఉండవలసి వస్తుంది.అందుకే ఇప్పుడు చేతిమణికట్టు దగ్గర రేడియల్ రక్తనాళాల ద్వారా కేథటార్‌ని పంపి చికత్స చేస్తున్నారు.
0 comments:
Post a Comment