Tuesday

ఇండియన్ ఫారెన్ సర్వీస్‌లో చేరడం ఎలా...?


1. ఐబీఏబీ-బెంగళూరు ఆఫర్ చేసే కోర్సులు? -మోహన్, రాజేంద్రనగర్.
ఇన్‌స్టిట్యూట్ బయోఇన్ఫర్మాటిక్స్ అండ్ అప్లయిడ్ బయోటెక్నాలజీ(ఐబీఏబీ) బెంగళూరులో ఉంది. ఈ ఇన్‌స్టిట్యూట్‌ను కర్ణాటక ప్రభుత్వం, ఐసీఐసీఐ బ్యాంక్ సహకారంతో 2002లో స్థాపించింది. ఈ ఇన్‌స్టిట్యూట్ బయోఇన్ఫర్మాటిక్స్, బయోటెక్నాలజీకి సంబంధించి పలు కోర్సులను ఆఫర్ చేస్తుంది. వివరాలు..

ఎంఎస్సీ(బయోఇన్ఫర్మాటిక్స్ అండ్ బయోటెక్నాలజీ)
పీజీ డిప్లొమా ఇన్ బయోఇన్ఫర్మాటిక్స్
అర్హత: 55 శాతం మార్కులతో బ్యాచిలర్ డిగ్రీ/మాస్టర్ డిగ్రీ (కంప్యూటర్ సైన్స్/స్టాటిస్టిక్స్/మ్యాథమెటిక్స్/ఫిజిక్స్/కెమిస్ట్రీ/ఫార్మసీ/లైఫ్ సెన్సైస్/ఏదైనా బ్రాంచ్‌తో ఇంజనీరింగ్‌లలో) లేదా ఎంబీబీఎస్/బీడీఎస్/బీవీఎస్సీ.
పోస్ట్‌గ్రాడ్యుయేట్ లేబొరేటరీ కోర్స్ ఇన్ బయోటెక్నిక్స్
అర్హత: లైఫ్ సెన్సైస్‌లోని ఏదైనా సబ్జెక్ట్‌తో ఎంఎస్సీ/బీటెక్ లేదా ఎంబీబీఎస్/బీఎస్సీ(బయోటెక్నాలజీ).
వివరాలకు: www.ibab.ac.in
......................

2. ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సీ (మ్యాథమెటిక్స్) కోర్సును ఆఫర్ చేస్తున్న వర్సిటీలేవి? -పూజిత, జడ్చర్ల.

యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్, ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సీ (మ్యాథమెటికల్ సెన్సైస్) కోర్సును ఆఫర్ చేస్తుంది.
ఐదేళ్లపాటు ఉండే ఈ కోర్సులో చేరడానికి అర్హత: 60 శాతం మార్కులతో సంబంధిత సబ్జెక్ట్‌లతో ఇంటర్మీడియెట్. యూనివర్సిటీ నిర్వహించే రాత పరీక్ష ఆధారంగా ప్రవేశం కల్పిస్తారు. సంబంధిత నోటిఫికేషన్ ప్రతి ఏటా మే నెలలో వెలువడుతుంది.
వివరాలకు: www.uohyd.ac.in

ఇతర ఇన్‌స్టిట్యూట్‌లు:
ఆదికవి నన్నయ యూనివర్సిటీ-రాజమండ్రి
కోర్సు: ఎంఎస్ మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్
అర్హత: ఇంటర్మీడియెట్ (మ్యాథమెటిక్స్, ఫిజిక్స్)
వివరాలకు: www.nannayauniversity.info
ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ-కాన్పూర్
కోర్సు: ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సీ (మ్యాథమెటిక్స్ అండ్ సైంటిఫిక్ కంప్యూటింగ్)
{పవేశం: ఐఐటీ-జేఈఈ ర్యాంక్ ఆధారంగా
వివరాలకు: www.iitk.ac.in
ఇండియన్ స్కూల్స్ ఆఫ్ మైన్స్-ధన్‌బాద్
కోర్సు: ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సీ (మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్)
{పవేశం: ఐఐటీ-జేఈఈ ర్యాంక్ ఆధారంగా
వివరాలకు: www.ismdhanbad.ac.in
.................

3. ఇండియన్ ఫారెన్ సర్వీస్‌లో చేరడం ఎలా? -సురేష్, ఆదిలాబాద్.

ప్రపంచంలోని వివిధ దేశాలతో రాజకీయ, దౌత్య, ఆర్థిక, వాణిజ్య, విద్య, సాంస్కృతిక సంబంధాలను దేశం తరపున పర్యవేక్షించే అత్యున్నత విభాగమే ఇండియన్ ఫారెన్ సర్వీస్ (ఐఎఫ్‌ఎస్). యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్సీ) నిర్వహించే సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ ద్వారా ఐఎఫ్‌ఎస్‌లో ప్రవేశం పొందొచ్చు. సివిల్ సర్వీసెస్ పరీక్షను యూపీఎస్సీ ప్రతి ఏటా నిర్వహిస్తుంది. గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా డిగ్రీ పూర్తి చేసిన వారు ఈ పరీక్షకు హాజరు కావచ్చు.

ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ మూడు దశలుగా ఉండే ఈ పరీక్షకు నోటిఫికేషన్ నవంబర్/ డిసెంబర్‌లలో వెలువడుతుంది. పరీక్షను మే నెలలో నిర్వహిస్తారు. మెయిన్స్ పరీక్షలు అక్టోబర్/ నవంబర్‌లలో ఉంటాయి. ప్రిలిమ్స్ అందరికీ కామన్‌గా, ఆబ్జెక్టివ్ పద్ధతిలో ఉంటుంది. ప్రిలిమ్స్‌లో అర్హత సాధించిన వారు మెయిన్స్‌కు హాజరు కావాలి.

మెయిన్స్ డిస్క్రిప్టివ్ పద్ధతిలో ఉంటుంది. ఇందులో 9 పేపర్లు ఉంటాయి. మెయిన్స్‌లో ఆప్షనల్ సబ్జెక్ట్స్‌ను ఎంచుకోవచ్చు. మెయిన్స్‌లో అర్హత సాధించిన వారికి ఇంటర్వ్యూ ఉంటుంది. ఇంటర్వ్యూలో అర్హత సాధించిన వారికి పోస్టింగ్ ఖరారు చేస్తారు. ఇందులో టాప్ ర్యాంక్ దక్కించుకుంటే ఇండియన్ ఫారెన్ సర్వీస్‌లో ఆఫీసర్‌గా కెరీర్ ప్రారంభించవచ్చు.
వివరాలకు: www.upsc.gov.in

సర్వీస్‌కు ఎంపికైన అభ్యర్థులకు లాల్‌బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడెమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్- ముస్సోరి (ఉత్తరాఖండ్) తర్వాత ఫారెన్ సర్వీస్ ఇన్‌స్టిట్యూట్- న్యూఢిల్లీలో శిక్షణ ఉంటుంది. ఈ సమయంలో వీరికి వివిధ అంశాలపై శిక్షణనిస్తారు. తప్పనిసరిగా ఒక ఫారెన్ లాంగ్వేజ్ నేర్చుకోవాలి.

సర్వీస్‌లో చేరిన తర్వాత విదేశాల్లోని భారతీయ కౌన్సులేట్స్‌లో పని చేయాల్సి వస్తే.. థర్డ్ సెక్రటరీ, సెకండ్ సెక్రటరీ, ఫస్ట్ సెక్రటరీ, కౌన్సెలర్, అంబాసిడర్, హైకమిషనర్, పర్మినెంట్ రిప్రజెంటేటివ్, వైస్ కౌన్సెల్, కౌన్సెల్, కౌన్సెల్ జనరల్ వంటి వివిధ హోదాలను అందుకోవచ్చు. విదేశాంగ మంత్రిత్వ శాఖలో రిక్రూట్ అయితే.. అండర్ సెక్రటరీ, డిప్యూటీ సెక్రటరీ, డెరైక్టర్, జాయింట్ సెక్రటరీ, అడిషనల్ సెక్రటరీ, సెక్రటరీ వంటి హోదాలు ఉంటాయి.
వివరాలకు: http://fsi.mea.gov.in/
....................

4. మన రాష్ట్రంలో బీటెక్(అగ్రికల్చర్ ఇంజనీరింగ్) కోర్సును ఆఫర్ చేస్తున్న కాలేజీలు?
-అభినయ్, కరీంనగర్.

బీటెక్ (అగ్రికల్చర్ ఇంజనీరింగ్) కోర్సులో.. వ్యవసాయానికి సంబంధించి మ్యానుఫాక్చరింగ్ ఆఫ్ అగ్రికల్చర్ మెషినరీ, అగ్రికల్చర్ సెన్సైస్, ఎఫెక్టివ్ ఇరిగేషన్ ప్రాక్టీస్ వంటి సంబంధిత అంశాలను బోధిస్తారు. కోర్సు పూర్తి చేసిన వారికి అగ్రికల్చర్ డిపార్ట్‌మెంట్, ఫుడ్ కార్పొరేషన్, డైరీ డిపార్ట్‌మెంట్, కృషి విజ్ఞాన కేంద్రాలు, ఇరిగేషన్ డిపార్ట్‌మెంట్, పరిశోధన సంస్థలు, అగ్రి ఇండస్ట్రియల్ కార్పొరేషన్స్, మ్యానుఫాక్చరింగ్ యూనిట్స్, ఎన్‌జీఓ, వ్యవసాయ రంగానికి రుణాలిచ్చే బ్యాంకులు, ఆర్థిక సంస్థలల్లో అసిస్టెంట్ ఇంజనీర్, డిజైనర్స్, టెక్నికల్ ఆఫీసర్స్, స్పెషలిస్ట్ ఆఫీసర్లు, మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్‌గా అవకాశాలు ఉంటాయి. సంబంధిత కోర్సును ఆఫర్ చేసే ఇన్‌స్టిట్యూట్/యూనివర్సిటీలలో ఫ్యాకల్టీగా కూడా చేరొచ్చు.

బీటెక్ (అగ్రికల్చర్ ఇంజనీరింగ్) కోర్సులో చేరడానికి అర్హత: ఇంటర్మీడియెట్(ఎంపీసీ) ఉత్తీర్ణత. రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించే ఇంజనీరింగ్ అగ్రికల్చర్ అండ్ మెడికల్ కామన్ ఎంట్రెన్‌‌స టెస్ట్(ఎంసెట్) పరీక్షలో వచ్చిన ర్యాంక్ ఆధారంగా అడ్మిషన్ ఖరారు చేస్తారు. సంబంధిత నోటిఫికేషన్ ప్రతి ఏటా ఫిబ్రవరిలో వెలువడుంది. మే నెలలో పరీక్ష ఉంటుంది.
మన రాష్ట్రంలో బీటెక్ (అగ్రికల్చర్ ఇంజనీరింగ్) కోర్సును ఆఫర్ చేస్తున్న కాలేజ్‌లు:
కాలేజ్ ఆఫ్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్-సంగారెడ్డి
(మెదక్ జిల్లా)
కాలేజ్ ఆఫ్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్-మడకశిర
(అనంతపురం జిల్లా)
కాలేజ్ ఆఫ్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్-బాపట్ల
(గుంటూరు జిల్లా)


From;
Sakshi

0 comments:

Post a Comment