Pages

Tuesday

'భారీ' పురుషులు పెరిగారు


గత పదేళ్లలో పురుషుల్లో శారీరకంగా 'భారీ' మార్పులు చోటు చేసుకుంటున్నాయని కెనడా యూనివర్సిటీ ప్రతినిధులు గుర్తించారు. ఉద్యోగాల్లో కుదురుకుంటున్న కొద్దీ పురుషులు లావెక్కుతుంటే, స్త్రీలు మాత్రం స్థిరంగానే ఉంటున్నారట. ఇద్దరినీ పోల్చిచూస్తే పురుషులే ఎక్కువగా ఒబెసిటీకి గురవుతున్నారని ఆ ప్రతినిధులు చెబుతున్నారు. ముఖ్యంగా మెడికల్, వ్యాపార, న్యాయ రంగాల్లో ఈ వ్యత్యాసాలు ఎక్కువగా ఉన్నాయని పరిశోధకులు అంటున్నారు.


స్త్రీలు మరింత చురుగ్గా ఉండటంలో భాగంగా ఇంట్లోనూ, పనిచేసే చోట కూడా చురుగ్గా వ్యవహరిస్తున్నారని వారి శోధనలో తేలింది. మేం కూడా సాధించగలం అనే పట్టుదల వారిలో పెరగడంతో పురుషులు కంటే స్త్రీలు మరింత మల్టీ టాస్కింగ్ చేస్తున్నారని అధ్యయన వేత్తలు చెబుతున్నారు. అందులో భాగంగా స్త్రీలు నడక, యోగా వంటివి చేస్తూ ఆరోగ్యపరంగా తగు జాగ్రత్తలు తీసుకోవడమే ఈ వ్యత్యాసానికి కారణమంటున్నారు.

No comments:

Post a Comment