Pages

Tuesday

మాల్‌వేర్ ముప్పు తప్పిందా...?


మాల్‌వేర్ అంటే హానికరమైన సాఫ్ట్‌వేర్. దీన్ని హ్యాకర్లు రూపొందించి వదులుతారు. కీలకసమాచారాన్ని గ్రహించడానికి, ప్రైవేట్ కంప్యూటర్ సిస్టమ్‌లను అన్ఆథరైజైడ్ ూక్సెస్ చేయడానికి ఈ సాఫ్ట్‌వేర్‌ను వినియోగిస్తారు. మాల్‌వేర్‌లో కంప్యూటర్ వైరస్, వార్మ్స్, ట్రోజన్, స్పైవేర్, అడ్‌వేర్, ఇతర హానికరమైన సాఫ్ట్‌వేర్‌లు ఉంటాయి. డీఎన్ఎస్ అంటే డొమైన్ నేమ్ సిస్టమ్స్. నెట్ యూజర్ల డీఎన్ఎస్ హైజాక్ చేయడం ద్వారా ఇంటర్నెట్ ఉపయోగిస్తున్న వారిని దారి మళ్లిస్తారు. ఇదే జరిగితే కంపెనీలకు కొన్ని కోట్ల నష్టం వాటిల్లుతుంది. పనులన్నీ నిలిచిపోతాయి. విలువైన సమాచారం ఇతరుల చేతుల్లో పడే అవకాశం ఉంది.


ప్రపంచ వ్యాప్తంగా హైజాకర్లు ఇలాంటి నెట్ దాడులకు పాల్పడటం కొత్తేమీ కాదు. అడపాదడపా ఇలాంటి సంఘటనలు వింటూనే ఉన్నాం. హైజాకర్లే కాకుండా తమ మాట వినడం లేదనీ, మా పనులకు అడ్డొస్తున్నారని హైజాక్ చేసే వాళ్లు ఉన్నారు. రిలయన్స్ నెట్ వినియోగదారులకు కొన్నినెలల క్రితం ఇలాంటి అనుభవమే ఎదురయింది. అనానిమస్ హ్యాకర్ గ్రూప్ ముప్పుతిప్పలు పెట్టించింది.


గూగుల్, జీమెయిల్, యాహూ, ఫేస్‌బుక్ ఇలా దేన్ని ఉపయోగించాలని ప్రయత్నించినా వేరే పేజీలోకి వెళ్లిపోవడం మొదలయింది. ఓపీ ఇండియా-రివెంజ్‌ను ప్రభుత్వం బ్లాక్ చేసినందుకు ప్రతీకారంగా ఈ చర్యకు పాల్పడ్డారు. రిలయన్స్ వెబ్ యూజర్లందరినీ వేరే సైట్‌కు దారి మళ్లించి అక్కడ హెచ్చరిక చేశారు. అంటే ఎవరికి కోపమొచ్చినా మీ మెయిల్ ఓపెన్ కాదు. మీరు ఎంతగానో ఇష్టపడి రూపొందించుకున్న వెబ్‌సైట్ ఓపెన్ కానని మొరాయిస్తుంది.పాస్‌వర్డ్ మీచేతుల్లోనే ఉన్నా ఓపెన్ చేయలేని పరిస్థితి తలెత్తుతుంది. సాధారణ ప్రజలను పక్కనపెడితే భారత రక్షణ అధికారుల పర్సనల్ కంప్యూటర్లు కూడా హ్యాకింగ్ గురయ్యాయి. వారి కంప్యూటర్లలో ఉన్న కీలకసమాచారాన్ని హ్యాకర్లు తస్కరించారు. దీంతో ప్రభుత్వం కీలకసమాచారాన్ని లాన్‌కనెక్షన్, నెట్‌కనెక్షన్ లేని కంప్యూటర్లలో మాత్రమే నిలువ చేయాలని ఆదేశించింది. దీన్నిబట్టి హ్యాకింగ్ బెడదను అర్థం చేసుకోవచ్చు.


భయమెందుకు?
మాల్‌వేర్ ఒకసారి కంప్యూటర్‌లోకి ఎంటర్ అయితే మీ వ్యక్తిగత సమాచారం ఇతరుల చేతుల్లోకి వెళుతుంది. ఆన్‌లైన్ బ్యాంకింగ్ చేస్తున్నట్లయితే మీ పిన్ నంబర్, ఇబే లాగిన్, పేపాల్ ఇన్‌ఫర్మేషన్...ఇలా ఒక్కటేమిటీ మీరు అన్‌లైన్‌లో చేస్తున్న అన్ని వివరాలు హైజాకర్ల చేతుల్లో పడే ప్రమాదముంది. ఇంటర్నెట్ వేగం స్లో అయిపోతుంది. మీరు ఫేస్‌బుక్ ఓపెన్ చేయాలని చూస్తుంటే అడ్వర్టయిజ్‌మెంట్ ఉన్న వెబ్‌సైట్ పదే పదే వస్తుంటుంది. మీరు క్లోజ్ చేయాలని చూసినా సాధ్యం కాదు. నెట్ ఆధారంగా పనిచేసే కంపెనీలకు కోట్లలో నష్టం వాటిల్లుతుంది. ఆన్‌లైన్ సేవలన్నీ స్థంభించి పోతాయి.


ఎలా విస్తరిస్తుంది?
ఈ రోజుల్లో ఇంటర్నెట్ జీవితంలో ఒక భాగంగా మారిపోయింది. బిల్ పేమెంట్స్, ట్రావెల్ బుకింగ్ నుంచి న్యూస్ పేపర్స్ చదవడం వరకు అన్ని పనులు ఆన్‌లైన్‌లో అయిపోతున్నాయి. దీన్ని ఆసరాగా చేసుకుని హ్యాకర్లు వ్యక్తిగత సమాచారాన్ని తస్కరిస్తున్నారు.చాలా మంది స్పాప్ మెయిల్స్‌కు మాత్రమే వైరస్ ఉంటుంది అనుకుంటారు. కానీ అది నిజం కాదు, మీ ఇన్‌బాక్స్‌లోకి వచ్చే మెయిల్స్‌లో కూడా వైరస్ ఉండొచ్చు. మాల్‌వేర్ ప్రొగ్రామ్స్‌ను ప్రొగ్రామర్స్ రూపొందిస్తారు. ఫ్రీ సబ్‌స్క్రిప్షన్స్, ఫ్రీ సాఫ్ట్‌వేర్ డౌన్‌లోడ్, ఇమేజేస్, వీడియోస్..ఇలా నెట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకునే వాటికి అనుసంధానం చేస్తారు. వీటిని డౌన్‌లోడ్ చేయాలి క్లిక్ చేయగానే మాల్‌వేర్ మీ సిస్టమ్‌లోకి ఎంటర్ అయిపోతుంది.


ఈ మెయిల్ అటాచ్‌మెంట్స్: ఈ మెయిల్ అటాచ్‌మెంట్స్ ద్వారా వైరస్ విస్తరిస్తోంది. మీరు బహుమతి గెలుచుకున్నారు. కింది లింక్‌పై క్లిక్ చేసి బహుమతి పొందేందుకు అవసరమైన కోడ్‌ని పొందండి. . ఫ్రీలోన్, స్పాట్ ఆఫర్...ఇలాంటి మెయిల్స్ తరచుగా వస్తుంటాయి. వీటిని క్లిక్ చేసినా, అటాచ్‌మెంట్స్ ఓపెన్ చేసినా వైరస్ వచ్చే అవకాశాలుంటాయి.


రోగ్ వెబ్‌సైట్స్ : కొన్ని రకాల వెబ్‌సైట్లలో వైరస్ ఉంటుంది. అడల్ట్ వెబ్‌సైట్స్, గ్యాంబ్లింగ్ వెబ్‌సైట్స్, పోర్న్‌సైట్స్‌ను ఒక్కసారి విజిట్ చేస్తే చాలు మీ సిస్టమ్‌లోకి వైరస్ వచ్చిపడుతుంది. ఈ తరహా వెబ్‌సైట్లలో ఒక్కటి ఓపెన్ చేస్తే చాలు మీ ప్రమేయంలేకుండానే పదుల సంఖ్యలో ఓపెన్ అవుతాయి.


నెట్‌వర్క్స్ : కంపెనీలలో, ఇతర సంస్థలలో కంప్యూటర్లన్నీ లాన్ నెట్‌వర్క్‌తో అనుసంధానం చేయబడి ఉంటాయి. ఏ ఒక్కరు వైరస్ ఉన్న వెబ్‌సైట్ ఓపెన్ చేసినా వైరస్ లాన్ ద్వారా అన్ని సిస్టమ్‌ల్లోకి ప్రవేశిస్తుంది.


ఫిషింగ్ స్కీమ్స్ : బ్యాంక్ లోగో, చిరునామాతో, క్రెడిట్ కార్డ్ కంపెనీ పేరుతో ఫిషింగ్ మెయిల్స్ వస్తుంటాయి. వాటిపై క్లిక్ చేసి లాగిన్ అయ్యారంటే మీ వ్యక్తిగత సమాచారం తస్కరించబడినట్లే.


ఇన్‌ఫెక్టెడ్ సాఫ్ట్‌వేర్ : నెట్‌లో నుంచి ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకునే వెబ్‌సైట్లు చాలా ఉంటాయి. కానీ అందులో చాలా వరకు హానికరమైనవే అయి ఉంటాయి. వాటిని డౌన్‌లోడ్ చేసి ఇన్‌స్టాల్ చేశారంటే సిస్టమ్ ఇన్‌ఫెక్ట్ అయినట్లే.


మొబైల్ డివైసెస్ : పెన్‌డ్రైవ్స్, డిజటల్ కెమెరాలు, మొబైల్ ఫోన్స్ వల్ల కూడా వైరస్ వ్యాపిస్తుంది.


ఏం చేయాలి?
కంప్యూటర్ వైరస్ ఎలా విస్తరిస్తుందో ముందుగా తెలుసుకోవాలి. గుర్తుతెలియని వ్యక్తులు పంపించిన మెయిల్ అటాచ్‌మెంట్స్ ఓపెన్ చేయకూడదు. ఫిషింగ్ మెయిల్స్ జోలికి వెళ్లకూడదు. యాంటీ వైరస్ సాఫ్ట్‌వేర్లను ఇన్‌స్టాల్ చేసుకోవాలి. ప్రతీ వారం మాల్‌వేర్‌ను క్లీన్ చేసే అలవాటు పెట్టుకోవాలి. స్కాన్ అండ్ డిటెక్ట్‌ను హాబీగా మలచుకోవాలి. పెన్‌డ్రైవ్ యూఎస్‌బీకి అటాచ్ చేసినపుడు, కొత్త సాఫ్ట్‌వేర్ డౌన్‌లోడ్ చేసినపుడు తప్పనిసరిగా వైరస్ స్కాన్ చేయాలి. యాంట్ వైరస్ సాఫ్ట్‌వేర్లను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేసుకోవాలి. కంప్యూటర్‌లో ఉన్న డాటాకు బ్యాకప్ పెట్టుకోవాలి. ఒరిజినల్ సాఫ్ట్‌వేర్ సీడీలను సేఫ్‌గా ఉంచుకోవాలి. ముఖ్యమైన ఫైల్స్‌ను సీడీలో రైట్ చేసి పెట్టుకోవాలి. ఈ జాగ్రత్తలు తీసుకుంటే ఎటువంటి మాల్‌వేర్ దాడినైనా ఎదుర్కోవచ్చనడంలో సందేహం లేదు.


ట్రోజన్స్ : ఇది వైరస్ కాదు. జినియన్ అప్లికేషన్ మాదిరిగా కనిపించే ఒక హానికరమైన ప్రొగ్రామ్. ట్రోజన్స్ ద్వారా మీకు తెలియకుండానే మీ సిస్టమ్‌లోకి ఎంటర్ చేసే అవకాశం ఆ ప్రొగ్రామ్ రూపొందించిన వారికి లభిస్తుంది. వ్యక్తిగత, రహస్య సమాచారాన్ని తెలుసుకునే అవకాశం వారికి దొరుకుతుంది.


వైరస్ : కంప్యూటర్‌లోకి ఎంటర్ కావడానికి రాసిన ఒక ప్రొగ్రామ్. ఇది కంప్యూటర్‌లోని ఫైల్స్, డాటాను డ్యామేజ్ చేస్తుంది.


స్పైవేర్ : ఇది కూడా ఒకరకమైన ప్రొగ్రామ్. మీ అనుమతి లేకుండానే పీసీలోకి ఇన్‌స్టాల్ అయిపోతుంది. మీ వ్యక్తిగత సమాచారం, బ్రౌజింగ్ హిస్టరీని ట్రాక్ చేసి రిమోట్ యూజర్‌కి పంపిస్తుంది.

No comments:

Post a Comment