పెట్టుబడులకు క్యూ కడుతున్న ఇండియన్ కంపెనీలు
మే నెల పెట్టుబడులు 2,750 కోట్ల పైమాటే
భారతీయులకే కాదు భారతీయ కంపెనీలకూ సింగపూర్ అంటే మోజు ఎక్కువే. భారత కంపెనీలు విదేశాల్లో చేసే ప్రత్యక్ష పెట్టుబడుల్లో అధిక శాతం ఈ దేశానికే తరలిపోతున్నాయి. మే నెలలో భారత కంపెనీలు 2,750 కోట్ల రూపాయల (50 కోట్ల డాలర్లు) నిధులను సింగపూర్‌లో ఇన్వెస్ట్ చేయడం ఇందుకు నిదర్శనం. మే నెలలో విదేశాలకు తరలిన మొత్తం పెట్టుబడులు రూ. 12,500 కోట్లు. ఈ లెక్కన మొత్తం పెట్టుబడుల్లో 20-25 శాతం సింగపూర్‌కే తరలివెళ్లినట్లు ప్రముఖ పారిశ్రామిక చాంబర్ అసోచామ్ ప్రకటించింది.
సింగపూర్ తర్వాత అమెరికా, బ్రిటన్, హాంకాంగ్, యుఎఇ, ఫిలిప్ఫీన్స్, మారిషస్‌లలో ఇండియన్ కంపెనీలు అధికంగా ఇన్వెస్ట్ చేసినట్లు గణాంకాలు సూచిస్తున్నాయి. భారత్‌కు తరలివచ్చే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు మారిషస్ అతిపెద్ద కేంద్రం. అయితే.. ఇండియన్లు విదేశాల్లో పెట్టుబడులు చేసేటప్పుడు మారిషస్‌కు అంతగా ప్రాధాన్యం ఇవ్వడం లేదని అసోచామ్ నివేదిక సూచిస్తోంది. మే నెలలో 467 కంపెనీలు విదేశాల్లో ఇన్వెస్ట్ చేయగా, ఇందులో 24మాత్రమే మారిషస్‌ను ఎంచుకున్నాయి. భారత కంపెనీలు ఉత్పత్తుల రంగానికి, ఆ తర్వాత సేవల రంగానికి అధికంగా ప్రాధాన్యమిచ్చాయి.
మే నెలలో 138 కంపెనీలు ఉత్పత్తుల రంగంలో ఇన్వెస్ట్ చేయగా, 100 కంపెనీలు సేవల రంగంపై మక్కువ ప్రదర్శించాయి. మరో 68 కంపెనీలు రిటైల్, హోటళ్లు, రెస్టారెంట్ వెంచర్లలో పెట్టుబడులు పెట్టాయి. యూరో సంక్షోభం నేపథ్యంలో విదేశాల్లో చౌక ఆస్తులు అందుబాటులోకి రావడమే భారత కంపెనీల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు పెరగడానికి కారణమని అసోచామ్ అధ్యక్షుడు రాజ్‌కుమార్ ధూత్ అంటున్నారు.

No comments:
Post a Comment