Tuesday

పరిశోధనలకు ప్రోత్సాహం..


ఇన్‌స్పైర్ స్కాలర్‌షిప్స్

అందించేది: కేంద్ర ప్రభుత్వంలోని శాస్త్ర,సాంకేతిక శాఖ విభాగం

ఉద్దేశం: 12వ తరగతి పూర్తిచేసుకున్న విద్యార్థులను పరిశోధనలవైపునకు ఆకర్షించడానికి కేంద్రప్రభుత్వంలోని శాస్త్ర, సాంకేతిక మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలోని డిపార్ట్‌మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ‘ఇన్నోవేషన్ ఇన్ సైన్స్ పర్‌స్యూట్ ఫర్ ఇన్‌స్పైర్‌డ్ రీసెర్చ్’ (ఇన్‌స్పైర్) స్కాలర్‌షిప్‌లను ప్రవేశపెట్టింది.

బేసిక్ సెన్సైస్, నేచురల్ సెన్సైస్‌లలో గ్రాడ్యుయేట్ స్థాయి నుంచే పరిశోధనలను ప్రోత్సహించడంతోపాటు.. రీసెర్చ్‌ను కెరీర్‌గా ఎంచుకోవాలనుకునేవారికి ఈ స్కాలర్‌షిప్స్‌ను అందిస్తోంది. నిష్ణాతులైన యువ శాస్త్రవేత్తలను దేశానికందించే ఉద్దేశంతో ‘స్కాలర్‌షిప్ ఫర్ హయ్యర్ ఎడ్యుకేషన్’ (ఎస్‌హెచ్‌ఈ) పేరుతో వీటిని ఇస్తున్నారు. ఈ ఏడాదికి స్కాలర్‌షిప్స్ నోటిఫికేషన్ వెలువడింది.

మొత్తం స్కాలర్‌షిప్స్: 10,000

ఏఏ కోర్సులకు:
గుర్తింపు పొందిన యూనివర్సిటీలు/సంస్థల్లో బేసిక్, నేచురల్ సెన్సైస్‌లో మొదటి ఏడాది బీఎస్సీ, బీఎస్సీ (ఆనర్స్), ఇంటిగ్రేటెడ్ ఎంఎస్, ఎంఎస్సీ కోర్సులు చదువుతున్న లేదా చదవడానికి నమోదు చేసుకున్న విద్యార్థులకు ఈ స్కాలర్‌షిప్స్ అందిస్తారు. మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బోటనీ, జువాలజీ, ఎర్త్ సెన్సైస్ కోర్సులు చదువుతున్న విద్యార్థులకు మాత్రమే ఈ స్కాలర్‌షిప్ అందుతుంది.

కొన్ని కోర్సులకు స్కాలర్‌షిప్ లేదు..
ఇంజనీరింగ్ సెన్సైస్, కంప్యూటర్ సెన్సైస్, అగ్రికల్చరల్ సెన్సైస్, ఎలక్ట్రానిక్ సెన్సైస్, మెడికల్ అండ్ బ యోమెడికల్ సెన్సైస్, అప్లైడ్ సెన్సైస్, ఇతర ప్రొఫెషనల్ కోర్సులు ఇన్‌స్పైర్ స్కాలర్‌షిప్ పరిధిలోకి రావు.

ఎన్నేళ్లపాటు:
విద్యార్థి ప్రతిభ, ఏటా అకడెమిక్ పరీక్షల్లో వచ్చిన మార్కులను బట్టి స్కాలర్‌షిప్‌ను పొడిగిస్తారు. ఇలా గరిష్టంగా ఐదేళ్లపాటు ఈ స్కాలర్‌షిప్‌ను అందుకునే సదుపాయం ఉంది.

అర్హతలు:
స్టేట్‌బోర్డ్స్/సెంట్రల్ బోర్డ్ 2012లో నిర్వహించిన 12వ తరగతి పరీక్షల్లో అత్యధిక మార్కులు సాధించిన 1 శాతం మందికి ఈ స్కాలర్‌షిప్స్ అందిస్తారు. వీరు గుర్తింపు పొందిన వర్సిటీల్లో నేచురల్ సెన్సైస్, బేసిక్ సెన్సైస్‌లలో బీఎస్సీ లేదా ఇంటిగ్రేటెడ్ ఎమ్మెస్సీ కోర్సులు చదువుతుండాలి.
లేదా
ఐఐటీ-జేఈఈ, ఏఐఈఈఈ, సీబీఎస్‌ఈ మెడికల్ బోర్డ్ నిర్వహించే జాతీయస్థాయి పోటీ పరీక్షలలో టాప్ 10,000 ర్యాంకులలోపు సాధించి ఉండటంతోపాటు ఐఐటీలు/ఎన్‌ఐటీల్లో నేచురల్, బేసిక్ సెన్సైస్‌లో బీఎస్సీ, బీఎస్సీ (ఆనర్స్), ఇంటిగ్రేటెడ్ ఎమ్మెస్సీ కోర్సులు చదువుతుండాలి.
లేదా
కిశోర్ వైజ్ఞానిక్ ప్రోత్సాహన్ యోజన (కేవీపీవై), నేషనల్ టాలెంట్ సెర్చ్ ఎగ్జామినేషన్ (ఎన్‌టీఎస్‌ఈ), జగదీశ్‌చంద్రబోస్ నేషనల్ సైన్స్ టాలెంట్ సెర్చ్ (జేబీఎన్‌ఎస్‌టీఎస్) స్కాలర్స్ ఐఐఎస్‌ఈఆర్, నైసర్, డీఏఈ-సీబీఎస్‌లలో ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సీ కోర్సులు అభ్యసిస్తుండాలి.
ఇంటర్నేషనల్ ఒలింపియాడ్స్‌లో పతకాలు సాధించిన విద్యార్థులు బ్యాచిలర్/మాస్టర్స్ స్థాయీ కోర్సులలో నేచురల్ సెన్సైస్ చదువుతుండాలి.

వయోపరిమితి:దరఖాస్తు సమర్పించేనాటికి వయస్సు కనీసం 17 ఏళ్లు ఉండి, 22 ఏళ్లు మించరాదు.

కటాఫ్ మార్కులు:
స్టేట్‌బోర్డులు, సెంట్రల్ బోర్డు నిర్వహించే 12వ తరగతి పరీక్షల్లో అత్యధిక మార్కులు సాధించిన 1 శాతం మందికి ఈ స్కాలర్‌షిప్‌లు ఇస్తారు. ఆ మార్కుల శాతం సాధించినవారు మాత్రమే ఇన్‌స్పైర్ స్కాలర్‌షిప్‌కు దరఖాస్తు చేసుకోవాలి. ఈ ఏడాదికి సంబంధించి కటాఫ్ మార్కుల శాతాలను డీఎస్‌టీ ఇంకా విడుదల చేయలేదు. 2011లో మన రాష్ట్ర విద్యార్థులకు ఇంటర్మీడియెట్‌లో నిర్దేశించిన కటాఫ్ మార్కుల శాతం 96.2

స్కాలర్‌షిప్ మొత్తం:
ఏడాదికి * 80,000. గరిష్టంగా ఐదేళ్లపాటు ఈ స్కాలర్‌షిప్ ఇస్తారు. ఇందులో * 60,000 నగదు స్కాలర్‌షిప్ కింద చెల్లిస్తారు. మిగతా *20,000 సమ్మర్ ప్రాజెక్ట్ కోసం ఇస్తారు.

సమ్మర్‌టైమ్ రీసెర్చ్ ప్రాజెక్ట్:
ఇన్‌స్పైర్ స్కాలర్‌షిప్ పొందిన విద్యార్థులందరూ వేసవి సెలవుల్లో దేశవ్యాప్తంగా ఉన్న వివిధ పరిశోధన సంస్థలలో సమ్మర్‌టైమ్ రీసెర్చ్ ప్రాజెక్ట్‌ను చేయాల్సి ఉంటుంది. విదేశాల్లో కూడా సమ్మర్ ప్రాజెక్ట్ చేయొచ్చు. దీనికోసం *20,000 మెంటార్‌షిప్ గ్రాంట్ ఉంటుంది.

ప్రాజెక్ట్ పూర్తయిన తర్వాత విద్యార్థి ఆ ప్రాజెక్టుకు సంబంధించి ఏ ఇన్‌స్టిట్యూట్‌లో.. ఎవరి వద్ద ప్రాజెక్ట్ వర్క్ చేశాడో వారి వద్ద అటెస్టేషన్ లెటర్ , ప్రాజెక్టుకు సంబంధించిన రిపోర్ట్ వివరాలను డీఎస్‌టీకి పంపాలి. ఇలా స్కాలర్‌షిప్ పొందే ఐదేళ్లు సమ్మర్ టైమ్ రీసెర్చ్ ప్రాజెక్ట్‌ను చేయాలి. దీని కోసం కేటాయించే * 20,000 వివిధ సెమినార్లకు హాజరయ్యేందుకు, నివసించడానికి, ఇతర ప్రాజెక్ట్ ఖర్చులకు ఉపయోగించుకోవచ్చు.

స్కాలర్‌షిప్ విడుదల:
స్కాలర్‌షిప్‌కు ఎంపికైన విద్యార్థులకు ఏడాదిలో రెండు విడతల్లో (* 30,000 చొప్పున) స్కాలర్‌షిప్ విడుదల చేస్తారు. ఇందుకోసం స్టేట్‌బ్యాంక్ ఆప్ ఇండియా (ఎస్‌బీఐ)లో పొదుపు ఖాతాను కలిగి ఉండాలి.

దరఖాస్తు విధానం:
ఆన్‌లైన్/ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

ఆఫ్‌లైన్ దరఖాస్తు పంపే విధానం:
నిర్దేశిత నమూనాలో పూర్తిచేసిన దరఖాస్తుతోపాటు పదో తరగతి మార్కుల లిస్ట్, ఇంటర్మీడియెట్ మార్కుల జాబితా, ఐఐటీ-జేఈఈ/ఏఐఈఈఈ ర్యాంక్ కార్డ్, గుర్తింపు పొందిన సంస్థ/యూనివర్సిటీలో చదువుతున్నట్లు లేదా నమోదు చేసుకున్నట్లు డెరైక్టర్/రిజిస్ట్రార్ లెటర్ అటెస్ట్‌డ్ జిరాక్స్ కాపీలను ఆర్డినరీ పోస్టులో పంపాలి. ఎన్వలప్‌పైన ‘అప్లికేషన్ ఫర్ ఇన్‌స్పైర్ స్కాలర్‌షిప్-2012’ అని రాయాలి.

ఆన్‌లైన్ దరఖాస్తు పంపే విధానం:
www.inspiredst.gov.in/online.html లో దరఖాస్తు చేయాలి. తర్వాత ప్రింటవుట్ తీసుకుని సంబంధిత పత్రాలతో దిగువ చిరునామాకు పంపాలి.

పూర్తిచేసిన దరఖాస్తులు పంపాల్సిన చిరునామా:
డెరైక్టర్, నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్, టెక్నాలజీ అండ్ డెవలప్‌మెంట్ స్టడీస్ (ఎన్‌ఐఎస్‌టీఏడీఎస్), డాక్టర్ కేఎస్ కృష్ణన్ మార్గ్, న్యూఢిల్లీ-110012.

దరఖాస్తులకు చివరి తేదీ: నోటిఫికేషన్ వెలువడిన నాటి నుంచి 90 రోజుల్లోగా దరఖాస్తును సమర్పించాలి. జూన్ 20, 2012న ప్రకటన వెలువడింది.

వెబ్‌సైట్: www.inspire-dst.gov.in
................

మనదేశంలో చదువుకోవడానికి పెద్ద అడ్డంకి ఆర్థికలేమి. ఎంతోమంది విద్యార్థులకు అపార ప్రతిభాసంపత్తి ఉన్నప్పటికీ పేదరికం వారిని ఉన్నత చదువులు చదవకుండా అడ్డుకుంటుంది. దీన్ని గుర్తించిన అనేక దేశీయ, విదేశీ ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు మేమున్నామంటూ వారికి భరోసానిస్తున్నాయి. చదువు పూర్తయ్యేవరకు స్కాలర్‌షిప్స్‌ను అందిస్తూ విద్యార్థుల కెరీర్ ఉన్నతికి తోడ్పడుతున్నాయి. ఆయా సంస్థలందించే స్కాలర్‌షిప్స్‌పై ఫోకస్..

మహీంద్రా ఆల్ ఇండియా టాలెంట్
స్కాలర్‌షిప్స్ ఫర్ పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సెస్
పదో తరగతి, ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణులై ప్రభుత్వ గుర్తిం పు పొందిన కళాశాలల్లో పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సులు చదువుతున్న విద్యార్థులకు అందించే మహీంద్రా ఆల్ ఇండియా టాలెంట్ స్కాలర్‌షిప్స్ కోసం ప్రకటన వెలువడింది. ముంబైలోని కె.సి. మహీంద్రా ఎడ్యుకేషన్ ట్రస్ట్ ఏటా ఈ స్కాలర్‌షిప్స్‌ను అందిస్తోంది.

మహిళలు, తక్కువ ఆదాయం ఉన్న కుటుంబాల పిల్లలకు, అంగవైకల్యం గల పిల్లలకు, ఆర్మ్‌డ్ ఫోర్సెస్ సంతానానికి స్కాలర్‌షిప్స్ కేటాయింపులో ప్రాధాన్యతనిస్తారు.
స్కాలర్‌షిప్ మొత్తం: మూడేళ్లపాటు నెలకు * 1000 చొప్పున ఏడాదికి (10 నెలలు) * 10,000 ఇస్తారు.

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది. పరిమితి మేరకు మౌఖిక పరీక్షకు హాజరైనవారికి ప్రయాణ ఖర్చులు చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం: దిగువ చిరునామాకు విద్యార్థులు సొంత చిరునామా ఉన్న కవరును పంపి జూలై 16వ తేదీలోగా దరఖాస్తులను పొందాలి.

దరఖాస్తులు పొందడానికి చిరునామా:
శ్రీ జయదీప్ దాస్,
డిప్యూటీ జనరల్ మేనేజర్-మార్కెటింగ్,
మహీంద్రా అండ్ మహీంద్రా లిమిటెడ్,
మహీంద్రా హౌస్, టి.ఎస్.రెడ్డి కాంప్లెక్స్,
1-7-1 పార్క్ లేన్, ఎస్.డి.రోడ్,
సికింద్రాబాద్-500003.

దరఖాస్తులు పొందడానికి చివరి తేదీ: జూలై 16, 2012
దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ: జూలై 30, 2012
వెబ్‌సైట్: www.mahindra.com
....................

రోడ్స్ స్కాలర్‌షిప్
ప్రపంచ ప్రఖ్యాత ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీలో పోస్ట్‌గ్రాడ్యుయేట్ కోర్సులను అభ్యసించాలనుకునే విద్యార్థులకు చక్కని అవకాశాన్ని కల్పిస్తుంది రోడ్స్ స్కాలర్‌షిప్. ఈ ఏడాదికిగాను సంబంధిత నోటిఫికేషన్ వెలువడింది. ఎంపికైన విద్యార్థులకు కనీసం రెండేళ్లపాటు ఈ స్కాలర్‌షిప్ సదుపాయం లభిస్తుంది.

ఒక ఏడాది వ్యవధి గల పోస్ట్‌గ్రాడ్యుయేషన్ కోర్సులో ప్రవేశం పొంది స్కాలర్‌షిప్‌నకు ఎంపిైకై..కోర్సు వ్యవధి ముగిశాక మరో కోర్సులో ప్రవేశం పొందిన కూడా స్కాలర్‌షిప్ సౌకర్యం యథావిధిగా కొనసాగుతుంది.

ఎంపికైన విద్యార్థులకు ట్యూషన్‌ఫీజు, విమాన ఛార్జీలు, మెయింటెనెన్స్ ఖర్చులు చెల్లిస్తారు.
అర్హత: భారతీయ పౌరులై, అక్టోబర్ 1, 2013 నాటికి 19 నుంచి 25 ఏళ్ల మధ్యలో ఉండాలి. గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి హ్యుమానిటీస్, సెన్సైస్, లా, ఇంజనీరింగ్, అగ్రికల్చర్, మెడిసిన్ విభాగాల్లో ప్రథమ శ్రేణి మార్కులతో బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత. చివరి సంవత్సరం చదువుతూ మంచి అకడెమిక్ రికార్డు ఉన్న విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు విధానం: వెబ్‌సైట్ నుంచి దరఖాస్తును డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
దరఖాస్తుకు చివరి తేదీ: జూలై 31, 2012. వెబ్‌సైట్: www.rhodesscholarships-india.com
..................

సాహుజైన్ ట్రస్ట్ స్కాలర్‌షిప్స్-న్యూఢిల్లీ
వివిధ కోర్సులు అభ్యసిస్తున్న విద్యార్థులకు సాహుజైన్ ట్రస్ట్ అందించే ఇన్‌లాండ్ స్కాలర్‌షిప్స్ కోసం నోటిఫికేషన్ వెలువడింది.

ఏఏ కోర్సులకు: టెక్నికల్ ట్రేడ్ కోర్సులు
(కంప్యూటర్స్, ఇన్ఫోటెక్ కోర్సులతో సహా)
ప్రొఫెషనల్ కోర్సులు
(ఇంజనీరింగ్, మెడిసిన్ మొదలైనవి)
గ్రాడ్యుయేషన్, పోస్ట్‌గ్రాడ్యుయేషన్, ఇతర కోర్సు లు చదువుతున్న విద్యార్థులకు అకడెమిక్ పరీక్షల్లో ప్రతిభ ఆధారంగా ఈ స్కాలర్‌షిప్స్ అందిస్తారు.
స్కాలర్‌షిప్ మొత్తం: కోర్సును బట్టి నెలకు * 150 నుంచి * 1000 వరకు ఈ స్కాలర్‌షిప్ అందుతుంది.

దరఖాస్తు విధానం: సొంత చిరునామా రాసిన 9 ఇన్‌టూ 4 సెం.మీ ఎన్వలప్‌పై * 5 స్టాంపులు అతికించి సెక్రటరీ, సాహుజైన్ ట్రస్ట్, 18, ఇన్‌స్టిట్యూషనల్ ఏరియా, లోఢి రోడ్, న్యూఢిల్లీ-110003 అనే చిరునామాకు పంపి దరఖాస్తులు పొందొచ్చు.
దరఖాస్తులు పొందడానికి చివరి తేదీ:జూలై20, 2012
పూర్తిచేసిన దరఖాస్తులు పంపడానికి చివరి తేదీ: జూలై 30, 2012
వెబ్‌సైట్: http://sahujaintrust.timesofindia.com

0 comments:

Post a Comment