ప్రధాని మన్మోహన్ సింగ్ నిజాయతీపరుడేనని అన్నా హజారే ఆదివారం వ్యాఖ్యానించారు. యూపీఏ సర్కారుకు నేతృత్వం వహిస్తున్న ఆయనసహా 15 మంది మంత్రులు అవినీతిపరులేనని, వారిపై న్యాయ విచారణ జరిపించాలని అన్నా బృందం శనివారం ఆరోపణలు గుప్పించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మహారాష్ట్రలోని పంథార్‌పూర్‌లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ- మంత్రిమండలిలో అవినీతిపరులున్నా ప్రధాని మాత్రం నిజాయతీగలవారేనన్నారు.
మరోవైపు పటిష్ఠ లోక్‌పాల్ బిల్లు రాకపోతే లోక్‌సభ ఎన్నికలు (2014) ప్రకటించాక తాను రామ్‌లీలా మైదానంలో దీక్షకు దిగడం ఖాయమని సతారాలో హజారే ప్రకటించారు. అప్పటిదాకా దేశమంతా పర్యటిస్తూ అవినీతి నిర్మూలనపై సర్కారు చిత్తశుద్ధి ఏపాటిదో ప్రజలకు వివరిస్తానని చెప్పారు. నిరుడు లోక్‌పాల్ బిల్లుకోసం సాగిన ప్రజాందోళన విచ్ఛిన్నానికి కేంద్ర హోంమంత్రి చిదంబరం కుట్ర పన్నారని ఆరోపించారు. జన లోక్‌పాల్ బిల్లు ఉండి ఉంటే ఈపాటికి ఆయన జైల్లో ఉండేవారని పేర్కొన్నారు.

0 comments:
Post a Comment