Monday

కమలహాసన్ సినిమా తిరస్కరించిన ఇళయరాజా


సినిమా సంగీతంలో ఇళయరాజా శైలి ప్రత్యేకమైనది. ప్రేమగీతాలలో మెలొడీకి పెద్దపీటవేసి, కొత్త ఒరవడి తెచ్చిన సంగీతకారుడాయన. ఎనభైలలో ఆయన కట్టిన బాణీలు ఇప్పటి తరం వారిని కూడా ఆకట్టుకుంటున్నాయంటే ఆ సంగీత జ్ఞాని ప్రతిభ ఎటువంటిదో మనం అంచనా కట్టచ్చు. అయితే, సినిమా కథ నచ్చకపోతే ఎంతటి పెద్ద హీరో సినిమానైనా సరే ఆయన తిరస్కరిస్తారన్న ప్రచారం ఒకటుంది. దానిని ఆయన కూడా ఒప్పుకుంటారు. అందుకు ఉదాహరణగా కమలహాసన్ సినిమా గురించి చెప్పారు.
      "ఓసారి కమల్ ఓ కథ చెప్పి, ట్యూన్స్ అడిగారు. ఆ సినిమాకి నేను చేయనని చెప్పాను. దాని నిండా వయోలెన్స్ వుంది, ఇక నేను చేయడానికి ఏముంటుంది? అన్నాను. అయితే, మళ్లీ రెండు రోజులు పోయాక ఆయన వచ్చి, కథకు మార్పులు చేశానన్నారు. ఒకసారి కథ అనుకున్నాక ఇంక మార్పులేముంటాయన్నాను. ఆ విధంగా ఆ సినిమాకి నేను పనిచేయలేదు. ఇదే కాదు... ఇలాంటి సినిమాలు చాలానే వున్నాయి" అన్నారు ఇళయరాజా. 'ధోనీ' సినిమా ఆడియో వేడుకకు హైదరాబాదు వచ్చిన సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఆయనీ విషయం చెప్పుకొచ్చారు.

0 comments:

Post a Comment