Monday

టైటిల్ మార్చిన మణిరత్నం


సమంతా ప్రధాన పాత్రలో మణిరత్నం రూపొందిస్తున్న తాజా తమిళ్ చిత్రానికి 'కడల్' అనే పేరును ఖరారు చేశారు. మొదట్లో 'పూక్కడై' అనే పేరుని పరిశీలించినప్పటికీ తాజాగా 'కడల్' టైటిల్ నే ఖరారు చేశారు. కథ జాలరి గ్రామ నేపథ్యంలో జరిగేది కావడం వల్ల 'కడల్' (సముద్రం) పేరుని నిర్ణయించినట్టు తెలుస్తోంది. గతంలో 'సీతాకోకచిలుక'... 'అన్వేషణ'... 'ఘర్షణ'... 'అభినందన'... వంటి చిత్రాల ద్వారా తెలుగు ప్రేక్షకులకి గుర్తుండి పోయాడు కార్తీక్. అతని కొడుకు గౌతమ్... ఈ సినిమా ద్వారా హీరోగా పరిచయమౌతున్నాడు. అతని సరసన నాయికగా సమంతా ఎంపికైంది. అర్జున్, అరవింద్ స్వామి, మంచు లక్ష్మి ప్రధాన పాత్రలు పోషిస్తోన్న ఈ సినిమాకి ఎఆర్ రెహ్మాన్ సంగీతాన్ని అందిస్తున్నారు.

0 comments:

Post a Comment