Friday

'చంపమాకు.... చంపమాకు' అంటున్న ధనుష్



 ఈమధ్య దేశాన్ని ఊపేసిన 'వై దిస్ కొలవెరి' పాటను తెలుగులోకి అనువదిస్తున్నారు. కారణం ఏమిటంటే, ఈ పాట వున్న తమిళ సినిమా '3' ని తెలుగు భాషలోకి కూడా డబ్ చేస్తున్నారు. రజనీకాంత్ పెద్ద కూతురు ఐశ్వర్య దర్శకత్వంలో ఆమె భర్త ధనుష్ హీరోగా రూపొందిన ఈ సినిమాలో ఈ పాటను ధనుష్ రాసి, పాడడం జరిగింది. ఆ పాటలో వున్న తమిళ, ఇంగ్లిష్ (టెన్ గ్లిష్ ) పదాల మేజిక్ కారణంగా అది పిల్లల్నీ, పెద్దల్నీ బాగా ఆకట్టుకుంది. ఇప్పుడీ పాటను తెలుగు, ఇంగ్లిష్ పదాల మేళవింపుతో రాయించారు. 'చంపమాకు.... చంపమాకు... చంపమాకు... చంపమాకమ్మా...' అంటూ సాగే ఈ తెలుగు వెర్షన్ పాటను కూడా హీరో ధనుష్ పాడాడట. సో... ఆడియో రిలీజ్ అయితే ఇది కూడా పాప్యులర్ అవుతుందన్న మాట! 

0 comments:

Post a Comment