Pages

Monday

రామ్ తదుపరి సినిమా 'ఒంగోలు గిత్త'...?


    'కందిరీగ' సినిమా సక్సెస్ తో హీరో రామ్ ప్రస్తుతం ప్రేమకథా చిత్రాల స్పెషలిస్ట్ కరుణాకరన్ దర్శకత్వంలో పూర్తి ప్రేమకథా చిత్రాన్ని చేస్తున్నాడు. 'ఎందుకంటే... ప్రేమంట' పేరుతో రూపొందుతున్న ఈ చిత్రంలో తమన్నా కథానాయికగా నటిస్తోంది. ఈ చిత్రం షూటింగు దాదాపు పూర్తయింది. ఇప్పటికే పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా ప్రారంభమైంది. తెలుగు, తమిళ భాషల్లో దీనిని నిర్మిస్తున్నారు. ఇదిలా ఉంచితే, ఈ చిత్రం తర్వాత రామ్ నటించే సినిమాకి కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయి. స్క్రిప్ట్ కూడా ఇప్పటికే రెడీ అయిందట. ఈ చిత్రానికి 'ఒంగోలు గిత్త' అనే టైటిల్ పెట్టాలనుకుంటున్నట్టు తెలుస్తోంది. కయ్యానికి సై అంటూ ఉత్సాహంతో ముందుకి ఉరికే వాళ్లను ఒంగోలు గిత్త అంటుంటారు. దీనిని బట్టే కథ ఎలా వుంటుందో ఊహించుకోవచ్చు!

No comments:

Post a Comment