Pages

Monday

'రెబల్'ని తట్టుకోవడం కష్టమౌతోందేమో...?


   ప్రభాస్ హీరో గా 'రెబల్' సినిమాని ఎనౌన్స్ చేయగానే అభిమానులు ఆనందంతో పొంగిపోయారు. నాగార్జునతో 'మాస్' ...  'డాన్' ... వంటి హిట్స్ ఇచ్చిన లారెన్స్ ఈ సినిమాని తెర కెక్కిస్తున్నాడని తెలిసి భారీ విజయం ఖాయమని భావించారు. అయితే ఈ సినిమా నుంచి ఒక్కొక్కరే తప్పుకోవడం పలు సందేహాలకి తావిస్తోంది. మొదట్లో ఈ సినిమా కోసం అనుష్కని కథా నాయికగా తీసుకుని, కొంత షూటింగ్ కూడా చేశారు. ఆ తరువాత ఏమైందో తెలియదు గానీ హఠాత్తుగా ఆమె అందులోంచి తప్పుకుంది.  దాంతో ఆమె స్థానంలో తమన్నాని తీసుకున్నారు. ఇక షూటింగ్ సజావుగానే జరుగుతోందని అనుకుంటోన్న తరుణంలో తాజాగా ఈ ప్రాజెక్ట్ నుంచి సంగీత దర్శకుడు తమన్ తప్పుకున్నారు. పలు కారణాల వల్లే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆయన ట్విట్టర్లో పోస్ట్ చేశాడు. యూత్ కి కావాల్సిన సంగీతంతో ఉర్రూతలూపుతోన్న తమన్, ఈ నిర్ణయం తీసుకోవడంతో అంతటా అది ఇప్పుడు  చర్చనీయాంశమైపోయింది.

No comments:

Post a Comment