Saturday

రామ్ గోపాల్ వర్మ సినిమాలో రాజకీయ పాత్రలు


ఈమధ్య కాలంలో వివాదాస్పద కథాంశాలను తన సినిమాలకు కథా వస్తువుగా ఎంచుకుంటున్న దర్శకుడు రాం గోపాల్ వర్మ తాజాగా మరో రాజకీయ కథా చిత్రాన్ని రూపొందించడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు. వర్తమాన భారతీయ రాజకీయ చిత్రాన్ని ఈ సినిమాలో ఆవిష్కరిస్తాడని తెలుస్తోంది. దీని కోసం స్క్రిప్ట్ వర్క్ కూడా జరుగుతోందని వర్మ సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. ఇందులో బాబా రామ్ దేవ్, అన్నా హజారే, చిరంజీవి, వై.యస్.జగన్ లను పోలిన పాత్రలను కూడా జొప్పిస్తున్నట్టు చెప్పుకుంటున్నారు. అయితే, ఇందులో ఎవరి మీద వ్యంగ్యాస్త్రాలను ఎక్కుపెడుతున్నాడన్నది ఇంకా తెలియదు. ఈ సినిమా కోసం ‘కుర్చీ’ అన్న టైటిల్ అనుకుంటున్నాడు.

0 comments:

Post a Comment