దేవుడున్నాడా? లేడా? అనే ప్రశ్నకి సమాధానం చెప్పడం చాలా కష్టం. ఎందుకంటే ఉన్నాడని నిరూపించలేని స్థితి! లేడని కొట్టి పారేయలేని పరిస్థితి! ఈ విషయంలో తరతరాలుగా ఆస్తికులకీ నాస్తికులకి మధ్య వాదోపవాదాలు జరుగుతూనే వున్నాయి. ఈ నేపథ్యంలోనే దేవుడున్నాడంటూ రజనీకాంత్ గట్టిగా చెప్పడంతో ఈ వార్త ప్రత్యేకతను సంతరించుకుంది. సృష్టి అనేది వుంది కాబట్టి సృష్టించేవాడు ఉన్నాడని రజనీకాంత్ అన్నారు. దేవుడున్నాడా? లేదా? అనే విషయంపై ఎంతోమంది ఎన్నో రకాలుగా తమ అభిప్రాయాల్ని వెల్లడిస్తూ వచ్చారనీ... తాను మాత్రం దేవుడున్నాడని నమ్ముతున్నానని చెప్పారు. తమిళనాడుకి చెందిన ప్రముఖ రచయిత సి.రామకృష్ణకి చెన్నయ్ లో జరిగిన సన్మాన సభలో మాట్లాడుతూ రజనీకాంత్ ఈ విధంగా స్పందించారు. రజనీకాంత్ రాఘవేంద్ర స్వామి భక్తుడనే విషయం అందరికీ తెలుసు. ఆయన మాటల్లోనూ చేతల్లోనూ అప్పుడప్పుడూ ఆధ్యాత్మికత తొంగి చూస్తూనే వుంటుంది. అయితే ఈసారి ఆయన ఒక సభలో ఇలా స్పదించడమే అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
0 comments:
Post a Comment