Saturday

ఐష్ తో పోల్చుకుంటున్న తమన్నా


ఇప్పుడు బాలీవుడ్ లోనూ, టాలీవుడ్ లోనూ కూడా ఐటెం సాంగ్స్ (వీటినే కొంతమంది తమ స్టేటస్ కి తగ్గట్టు ‘స్పెషల్ సాంగ్స్’ అని పిలుచుకుంటున్నారు)  చేయడానికి పెద్ద హీరోయిన్లు కూడా రెడీ అయిపోతున్నారు. ఎటొచ్చీ కాస్త ఎక్కువ పారితోషికం ఇవ్వాలంతే! ప్రస్తుతం తెలుగులో నెంబర్ వన్ స్థానం కోసం పోటీపడుతున్న తమన్నా కూడా ఇటువంటి పాటలు చేయడానికి తనకు అభ్యంతరం లేదంటోంది.
అయితే, దీనికి ఓ షరతు మాత్రం పెడుతోంది. తనకి ఆఫర్ చేసే పాట ఆషామాషీగా ఉండకూడదట. ఫుల్ ఎనర్జిటిక్ గా, జోష్ తో ఉండాలట. ఇంకా చెప్పాలంటే… ‘బంటీ ఔర్ బబ్లీ’ సినిమాలో ఐశ్వర్యా రాయ్ చేసిన ‘కజరారే… ‘ పాట రేంజ్ లో ఉండాలట. అలా వుంటే కనుక తను వెంటనే ఒప్పేసుకుంటానంటోంది. సాంగ్ చేయడం మాటెలా వున్నా… ఈమె వరస చూస్తుంటే, తనని తాను ఐష్ తో పోల్చుకోవడానికి తమన్నా ఇలా చెబుతోందని టాలీవుడ్ జనం అంటున్నారు.

0 comments:

Post a Comment