Monday

సునీల్ 'పూల రంగడు' ఆ చిత్రం కాపీ




సునీల్, ఇషా చావ్లా జంటగా నటిస్తున్న చిత్రం 'పూల రంగడు' విడుదలైంది. కామీడితో రూపొందిన ఈ చిత్రం 2005 లో వచ్చిన మళయాళ కామిడీ హీరో దిలీప్ నటించిన పండిప్పడ కాపీ అని తెలుస్తోంది. నవ్య నాయిర్,ప్రకాష్ రాజు,రాజన్ పి.దేవ్ నటించిన ఈ చిత్రం అక్కడ ఓ మాదిరిగా ఆడింది. స్లాఫ్ స్టిక్ కామిడీతో నడిచే ఈ చిత్రం ఈ చిత్రంలో హీరో తనకున్న అప్పులు తీర్చుకోవటం కోసం ఓ మారు మూల గ్రామంలో ఉన్న తన ఆస్ధి అయిన చిన్న స్ధలాన్ని అమ్మకోవటానికి బయిలు దేరతాడు. ఇక ఇప్పటి పూలరంగడులో ...హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుంటాడు రంగ(సునీల్). వరంగల్ జిల్లా పరకాలలో దుబాయ్ కి చెందిన వ్యక్తికి 30 ఎకరాల భూమి ఉంటుంది. దాన్ని అమ్ముకుందామంటే... ఆ ఊర్లో ఉండే ఇద్దరు విలన్స్ కొండారెడ్డి(దేవ్ గిల్), లాలాగౌడ్(ప్రదీప్ రావత్) భూమిని ఎవరూ కొనకుండా వచ్చిన వాళ్లను వచ్చినట్లు చంపేస్తుంటారు. మళయాళంలో ఇవే పాత్రలు రాజన్ పి దేవ్,ప్రకాష్ రాజ్ చేసారు.

వీరిద్దరి మధ్యా వైరం విషయాన్ని దాచి ఆ భూమిని తక్కువ ధరకే రంగకు అమ్ముతారు దాని యజమాని. ఎక్కువ లాభం వస్తుందనే ఆశతో ఆ భూమిని కొన్న రంగ...ఆ ఇద్దరు గురించి తెలుసుకుని ఓ ప్లాన్ చేస్తాడు. ఎలాగైనా ఆభూమిని దక్కించుకోవడానికి తన స్నేహితుడు అలీ ద్వారా తొలుత కొండారెడ్డి దగ్గర పనికి చేరుతాడు. మళయాళంలో దిలీప్ తన కామెడీ ప్రెండ్ సహాయింతో అక్కడ ప్రకాష్ రాజ్ ఇంటిలో పనికి చేరుతాడు. కొండరెడ్డికి, లాలాగౌడ్ కూతురు అనితకు పెళ్లి చేసి ఇరు కుటుంబాలను కలిపి, తన భూమిని అమ్మేసుకుని వెలుదామనే ప్లాన్ వేస్తాడు. అక్కడ కూడా ప్రకాష్ రాజ్ కి రాజన్ పి దేవ్ పి దేవ్ కూతురుని సెట్ చేసి అక్కడ నుంచి తన భూమిని అమ్ముకుని వెళదామనుకుంటాడు. అయితే అనిత రంగను ప్రేమిస్తున్నట్లు చెప్పేస్తుంది. అక్కడ నవ్య నాయిర్ తను దిలీప్ ని ప్రేమిస్తున్నాని చెప్తుంది. అలా అక్కడ ఉన్నది ఉన్నట్లు మక్కీకి మక్కీ దింపాడని చెప్తున్నారు. గతంలోనూ వీరభద్రం డైరక్ట్ చేసిన అహనా పెళ్లంట చిత్రం కొరియన్ కామిడీ మ్యారీయింగ్ మాఫియా ఆధారంగా రూపొందించిన సంగతి తెలిసిందే.

0 comments:

Post a Comment