ఏ విధమైనా పరికరాలు అవసరం లేకుండా మనం చేయగలిగిన ఏకైక శారీరక వ్యాయామము యోగా మాత్రమే, పాశ్చాత్యులతో సహా మొత్తం ప్రపంచం నేడు యోగాకు దాసోహం అంటుంది. యోగా అనే ప్రక్రియను మన జీవన విధానంలో ఒక భాగంగా ప్రతి ఒక్కరూ చేసిన రోజు 75 ఏళ్ళ వయస్సు వచ్చినా ఆరోగ్యవంతంగానే కాక అర్థవంతంగా జీవితం కొనసాగించవచ్చు.
ఊర్థ్వహస్తాసనం
నిటారుగా నిల్చోవాలి, రెండు చేతులు శరీరానికి రెండు పక్కలా ఉంచాలి. పాదాలు రెండు దగ్గరగా ఉంచాలి. ఇప్పుడు గాలి పీల్చుకుంటా రెండు చేతులను జతచేసి తలకు పైన తీసుకెళ్ళాలి. ఇప్పుడు గాలి వదులుతూ చేతులను తలను శరీరపు పై భాగాన్ని కుడి వైపుగా వంచాలి. రెండు సెకన్లు ఆగి గాలి పీల్చుకుంటూ మధ్యలోకి రావాలి. మళ్ళీగాలి వదులుతూ ఎడమ వైపుగా శరీరాన్ని వంచాలి. ఇదే విధంగా పది సార్లు రిపీట్ చేయాలి. శరీరము కుడివైపునకు వంచినప్పుడు దృష్టి అంతా ఎడమ వైపు శరీరము పైన ఉంచాలి.
ఉపయోగాలు
1. భుజాలు తీరైన ఆకృతిని సంతరించుకుంటాయి.
2. శరీరపు ఊర్థ్వభాగానికి మంచిది.
ఉదరాకర్షక ఆసనం
ముని కాళ్ళపై కూర్చోవాలి. రెండు చేతులు రెండు మోకాళ్ళపై ఉంచాలి. ఇప్పుడు గాలి పీల్చుకుని గాలి వదులుతూ కుడివైపుకు తిరగాలి. అదే సమయంలో ఎడమ మోకాలిని భూమికి ఆన్చాలి. కుడికాలు పొట్టమీద ఒత్తిడిని కలిగిస్తుంది. మళ్ళీ గాలి పీల్చుకుని ముందుకువచ్చి గాలి వదులుతూ ఎడమవైపు వెనక్కి చూడాలి. పదిసార్లు రిపీట్ చేయాలి.
ఉపయోగాలు:
1. నడుం భాగంలో కొవ్వును బాగా తగ్గిస్తుంది.
2. మెన్సెస్ సమయంలో నొప్పిని నివారిస్తుంది.

0 comments:
Post a Comment