Pages

Saturday

ఎఫ్-35 విమానాలు ఇస్తామనలేదు కావాలంటే వివరాలు ఇస్తాం: అమెరికా


 తాము ఇప్పటికే ఇస్తున్న ఎఫ్-16, ఎఫ్- 18 యుద్ధ విమానాలు భారతదేశానికి అద్భుతమైన సైనిక పాటవాన్ని అందజేస్తున్నాయని, అంతకంటే అత్యాధునికమైన ఎఫ్-35 జాయంట్ స్ట్రైక్ ఫైటర్ల (జేఎస్ఎఫ్)ను అందించే ఆఫర్ మాత్రం చేయలేదని అమెరికా తెలిపింది. 

ఈ రెండు రకాల విమానాలు భారత్‌కు అద్భుతమైన పరిజ్ఞానాన్ని తక్కువ ధరకే ఇస్తున్నాయని పెంటగాన్ అధికార ప్రతినిధి కమాండర్ లెస్లీ హల్ రైడ్ అన్నారు. భారత వైమానిక దళానికి కావల్సిన ఎంఎంఆర్‌సీఏ విమానాల సరఫరా కాంట్రాక్టును ఫ్రెంచిసంస్థ డస్సాల్ట్‌కు ఇస్తున్నట్లు భారత్ ప్రకటించిన ఒకరోజు తర్వాత అమెరికా నుంచి ఈ ప్రకటన వచ్చింది.

ఒకవేళ భారత్‌కు కొనాలని ఆసక్తి ఉంటే మాత్రం తాము ఎఫ్-35 విమానాలకు సంబంధించిన వివరాలు అందజేయడానికి అమెరికా సిద్ధంగాఉందని ఆమె అన్నారు.


No comments:

Post a Comment