ఎం2 మిషన్ గన్‌లో బాగా ఉపయుక్తం
1.5 కిలోమీటర్ల దూరం వెళ్లగల సత్తా
లేజర్ గైడెన్స్ వ్యవస్థతో సుసంపన్నం
మరో మూడేళ్లలో వాడకానికి సిద్ధం
పూర్తిగా వస్తే యుద్ధ క్షేత్రంలో అద్బుతాలే
బుల్లెట్లు విజయవంతమైతే బాంబులకూ ఇదే సూత్రం

రెండు వేళ్ల మధ్య ఒద్దికగా ఒదిగిపోయి.. బుల్లి క్షిపణిలా కనిపిస్తున్న ఈ బుల్లెట్‌ను చూశారా? లేజర్ గైడెడ్ మిసైల్‌కు ఏమాత్రం తీసిపోని స్థాయిలో.. ఆధునిక యుద్ధతంత్రాలను సమూలంగా మార్చేసే సామర్థ్యం ఈ బుల్లెట్‌కు ఉంటుంది. ఎలాగంటారా... రాక్షసుడిని సంహరించడానికి విష్ణుమూర్తి సుదర్శన చక్రాన్ని ప్రయోగించినప్పుడు ఆ రాక్షసుడు ఎటు వెళ్తే అటే వెళ్లి మరీ సంహరిస్తుంది చూశారా.. అచ్చం అలాగే ఇది కూడా నిర్దేశించిన లక్ష్యాన్ని వెంటాడి వేటాడి మరీ ఛేదిస్తుంది! దీనిపేరే గైడెడ్ బుల్లెట్.
ప్రస్తుతానికి ప్రాథమిక పరిశోధనల స్థాయిలోనే ఉన్న ఈ బుల్లెట్ పూర్తిస్థాయిలో సిద్ధమైతే.. దాదాపు కిలోమీటరు దూరంలోని లక్ష్యాన్ని ఏమాత్రం గురి తప్పకపోవడంతో పాటు, లక్ష్యం పక్కకు తప్పుకొంటే ఆ పక్కకి వెళ్లి మరీ ఛేదిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ప్రాసెసర్ సహా ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను మిషన్‌గన్ బుల్లెట్‌లోకి చొప్పించే ఈ సవాలును అల్బుకెరక్‌లోని శాండియా నేషనల్ లాబొరేటరీస్‌కు చెందిన శాస్త్రవేత్తలు దీటుగా స్వీకరించారు.
.50 కాలిబర్ బుల్లెట్‌లోకే లేజర్ గైడెన్స్ పరిజ్ఞానాన్ని చొప్పించి ఈ అద్భుతాన్ని సాధించారు. ఎం2 తరహా మిషన్‌గన్‌కు ఈ బుల్లెట్‌ను అమరిస్తే సైనికులు మరింత వేగంగా, కచ్చితంగా లక్ష్యాలను ఛేదిస్తారని అంటున్నారు. ప్రస్తుతానికి ఇంకా ప్రయోగశాల దశను దాటని ఈ బుల్లెట్ మరింత పరిజ్ఞానాన్ని సొంతం చేసుకుని, యుద్ధక్షేత్రంలోకి అడుగుపెట్టిందంటే.. ఇక భారీ విధ్వంసం తప్పదు.
ఉదాహరణకు శత్రువుకు గురిపెట్టి ఈ బుల్లెట్‌ను కాలిస్తే, ఆ శత్రువు బుల్లెట్ తగలకుండా కింద పడుకున్నా.. పక్కకు తప్పుకొన్నా.. బుల్లెట్‌ప్రూఫ్ జాకెట్ వేసుకున్నా కూడా ఎలాంటి ప్రయోజనం ఉండదు. సుదర్శన చక్రంలాగే గైడెడ్ బుల్లెట్ కూడా వెంటాడి వేటాడి మరీ హతమారుస్తుంది. బుల్లెట్‌ప్రూఫ్ జాకెట్ లేని ప్రదేశాన్ని చూసుకుని మరీ అక్కడకు దూసుకెళ్తుంది. వినడానికి ఇదంతా హాలీవుడ్ యాక్షన్ సినిమా తరహాలో కనిపిస్తున్నా, రాబోయే కాలంలో కాబోయే వాస్తవం ఇదేనని రక్షణరంగ నిపుణులు చెబుతున్నారు.
మరో మూడు సంవత్సరాల కాలంలో యుద్ధక్షేత్రంలోకి ఈ బుల్లెట్ ప్రవేశిస్తుందని కూడా అంటున్నారు. చిన్న చిన్న ఆయుధాలను తయారుచేయడం గత కొన్ని దశాబ్దాలుగా అమెరికా ప్రభుత్వం, రక్షణరంగ శాస్త్రవేత్తలకు కొన్ని దశాబ్దాలుగా సవాలుగానే ఉంది. తమ సైన్యంలోని స్నైపర్లు, ఇతర ప్రత్యేకదళాల కోసం గైడెడ్ ఆయుధసామగ్రిని అందజేసేందుకు అమెరికన్ రక్షణ శాఖ వందల కోట్ల డాలర్లు ఖర్చుపెడుతోంది.
ఈ డిజైన్‌ను కంప్యూటర్ సిమ్యులేటర్ల మీద, మైదానాల్లో నమూనా బుల్లెట్లను పరిశీలించారు. ఇక ఈ నమూనా బుల్లెట్ల పరీక్షలు పూర్తిచేసి పూర్తిస్థాయి గైడెడ్ బుల్లెట్‌ను సిద్ధం చేయడమే తరువాయి అంటున్నారు. ఇప్పటికి ఇంకా దీని తయారీలో కొన్ని ఇంజనీరింగ్ సమస్యలున్నాయి.
ఉదాహరణకు ట్రక్కుల వెనుకభాగాన్ని కూడా ఛేదించుకుని వెళ్లేంత పటిష్ఠంగా దీన్ని రూపొందించాల్సి ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దాంతోపాటు సైన్యం మిషన్‌గన్లలో వీటిని ఉపయోగించేందుకు వీలుగా వీలైనంత చవగ్గా తయారు చేయాలంటున్నారు. అలాగే, బుల్లెట్ల తర్వాత బాంబులలో కూడా ఇలాంటి పరిజ్ఞానాన్ని అమర్చేందుకు ప్రయత్నాలు జరగొచ్చు.
యుద్ధరంగంలో అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించే దేశాలు మాత్రమే వీటిని అధిగమించే అవకాశం ఉంటుంది. ఉదాహరణకు ఎనిమిదో దశకం చివర్లో జరిగిన గల్ఫ్ యుద్ధంలో అమెరికా స్కడ్ క్షిపణులను ప్రయోగిస్తే.. సద్దాం హుస్సేన్ సర్కారు వాటిని దీటుగా ఎదుర్కొనే పేట్రియాట్ క్షిపణులను ప్రయోగించింది. సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందడానికి ఇప్పుడు ఎక్కువ కాలం పట్టడంలేదు కాబట్టి, ఈ బుల్లెట్లు వచ్చిన కొంత కాలం తర్వాత వాటిని తప్పించుకోవడమో.. లేదా తప్పుదోవ పట్టించడమో చేయగల పరిజ్ఞానాన్ని వేరెవరో తయారుచేయాలి. అప్పటివరకు మాత్రం వీటి ప్రభంజనం కొనసాగుతూనే ఉంటుంది.
బుల్లెట్ పొడవు: 4 అంగుళాలు
వ్యాసం: అర అంగుళం
వెళ్లగల దూరం: 1.5 కిలోమీటర్లకు పైగానే
సెకనుకు తనలో తాను చేసుకోగల మార్పులు: దాదాపు 30
పనితీరు: ఇందులో ఒక ఆప్టికల్ సెన్సర్ ఉంటుంది. ఇది లక్ష్యం మీద ప్రసరింపజేసిన లేజర్ కిరణాన్ని గుర్తించి, ఆ సమాచారాన్ని బుల్లెట్‌లోని గైడెన్స్ వ్యవస్థకు పంపుతుంది. ఆ సమాచారం ఎలక్ట్రోమాగ్నెటిక్ యాక్చువేటర్లకు చేరుతుంది. ఈ యాక్చువేటర్లే బుల్లెట్‌ను గైడ్‌చేసే ఫిన్లను నడిపిస్తాయి. కిలోమీటరు దూరంలో ఉన్న లక్ష్యాన్ని ఛే దించేటపుడు సాధారణ బుల్లెట్ అయితే లక్ష్యం నుంచి 10 గజాలు అటూ ఇటూ వెళ్లే అవకాశం ఉంటుంది. అదే గైడెడ్ బుల్లెట్ అయితే కేవలం 8 అంగుళాల తేడాతోనే లక్ష్యాన్ని ఛేదిస్తుంది.

No comments:
Post a Comment