Pages

Saturday

భారతీయ విద్యార్థిపై జాతి వివక్ష విచారణ చేస్తున్న అధికారులు


జాతి వివక్ష కారణంగా హార్వర్డ్, ప్రిన్స్‌టన్ విశ్వవిద్యాలయాలు తనకు అండర్ గ్రాడ్యుయేట్‌లో ప్రవేశం కల్పించేందుకు నిరాకరించాయని భారతీయ అమెరికన్ విద్యార్థి ఒకరు ఆరోపించారు. ఈ మేరకు కాలిఫోర్నియాకు చెందిన విద్యార్థి ఫిర్యాదు చేసిన ట్టు బ్లూమ్‌బెర్గ్‌కు చెందిన మీడియా తెలిపింది. 

ఈ ఆరోపణలపై అమెరికా విద్యా విభాగం విచారణ ప్రారంభించింది. అమెరికా విద్యావిభాగంలోని పౌరహక్కుల కార్యాలయానికి గత ఆగస్టు 22న విద్యార్థి ఫి ర్యాదు అందింది. ఇందులోని ఆరోపణలపై విచారణకు గత నెల 11న ఆదేశించారు. జాతి వివక్షతోనే ఆసియన్ ఆమెరికన్లకు ప్రవేశాలు నిరాకరించినట్టు బాధిత విద్యార్థి ఆరోపించారు. 

అయితే, తమ విశ్వవిద్యాలయంలో వివక్ష లేదని, అండర్ గ్రాడ్యుయేట్లలో 16శాతం ఆసియన్ అమెరికన్లు ఉన్నారని హార్వర్డ్ ప్రతినిధి తెలిపారు. కాగా, స్పెయిన్, పోర్చుగల్ వాసులు, ఆఫ్రికన్లు, శ్వేతవర్ణుల కన్నా ఆసియన్ అమెరికన్లు విశ్వవిద్యాలయంలో ప్రవేశానికి శల్యపరీక్షలు ఎదుర్కోవాల్సి ఉంటుందని బ్లూమ్‌బెర్గ్ మీడియా పేర్కొంది.

తాము వివక్ష చూపడం లేదని న్యూజెర్సీలోని ప్రిన్స్‌టన్ విశ్వవిద్యాలయం కూడా స్పష్టం చేసింది. 2007-08లో 14.1శాతం ఉన్న ఆసియన్ అమెరికన్ల ప్రవేశాలు ఈ ఏడాది 17.7శాతానికి పెరిగాయని వివరించారు.

No comments:

Post a Comment