Saturday

INTERNATIONAL NEWS»  11 సౌరవ్యవస్థల్లో.. 26 కొత్త గ్రహాలు కెప్లర్ టెలిస్కోపు ద్వారా కనుగొన్నట్టు నాసా సైంటిస్టుల ప్రకటన


విశ్వం గుట్టుమట్లు తెలుసుకునేందుకు దుర్భిణీ వేసి వెదుకుతున్న నాసా శాస్త్రజ్ఞులు.. 11 సౌరవ్యవస్థల్లో 26 కొత్త గ్రహాల జాడను కెప్లర్ టెలిస్కోపు పసిగట్టిందని ప్రకటించారు. కొత్తగా కనుగొన్న గ్రహాల్లో కొన్ని భూమికన్నా ఒకటిన్నర రెట్లు పెద్దవిగా ఉండగా.. మరికొన్ని గురుగ్రహం కన్నా పెద్దగా ఉన్నాయట. అయితే వీటిని ఇంకా విశ్లేషించాల్సి ఉందని తెలిపారు. ఇవన్నీ వాటి నక్షత్రాల చుట్టూ 6 నుంచి 143 రోజుల కాలవ్యవధిలో పరిభ్రమిస్తున్నాయని కెప్లర్ ప్రోగ్రామ్ సైంటిస్టు డౌగ్ హ డ్గిన్స్ తెలిపినట్టు అమెరికన్ మీడియా ప్రచురించింది.

0 comments:

Post a Comment