పాశ్చాత్య దేశాల అనుమానాలను నిజం చేస్తూ తొలి అణు ఇంధన కడ్డీని రూపొందించినట్లు ఇరాన్ ప్రకటించింది. అంతేకాదు, ఇప్పటికే దాన్ని ఇరాన్ అధ్యయనం చేస్తున్న అణు విద్యుత్ కేంద్రం కోర్‌లో కూడా అమర్చారు. ఆ దేశ అణు ఇంధన సంస్థ వెబ్‌సైట్‌లో అధికారులు ఈ వివరాలను పొందుపరిచారు. అణు ఇంధన కడ్డీలో శుద్ధి చేసిన యురేనియం ఉంటుంది. అయితే ఇరాన్ ఉపయోగిస్తున్న కడ్డీలో యురేనియం ఉన్నదీ లేనిదీ స్పష్టం చేయలేదు. ఇరాన్ తాజా ప్రకటనతో పాశ్చాత్య దేశాల్లో గుబులు పెరుగుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. యురేనియం శుద్ధి కార్యక్రమంతో అణ్వాయుధాల తయారీ దిశగా ఇరాన్ అడుగులు వేస్తోందని పలు దేశాలు ఇప్పటికే ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
0 comments:
Post a Comment