పిల్లలకు వాళ్లే ఆదర్శప్రాయులవుతున్నారు
ఇన్ఫోసిస్ నారాయణమూర్తి ఆవేదన
త్రిభాషా సూత్రం కావాల్సిందే
మీ పిల్లలకు ఇంగ్లీషు చదువులు..
పేదల పిల్లలకు మాతృభాష మాత్రమేనా
మూడు భాషలు అవలీలగా నేర్చుకోగలరు
అవి నేర్పితేనే ప్రపంచవ్యాప్త అవకాశాలు
ఇన్ఫోసిస్ నారాయణమూర్తి ఆవేదన
త్రిభాషా సూత్రం కావాల్సిందే
మీ పిల్లలకు ఇంగ్లీషు చదువులు..
పేదల పిల్లలకు మాతృభాష మాత్రమేనా
మూడు భాషలు అవలీలగా నేర్చుకోగలరు
అవి నేర్పితేనే ప్రపంచవ్యాప్త అవకాశాలు
దేశంలో అవినీతిపరులను, నిజాయితీ లేనివారినే పిల్లలు ఆదర్శ పురుషులుగా తీసుకుంటున్నారని ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో ఆదర్శప్రాయులు తగ్గిపోతున్నారని.. అసలు నిజాయితీ, ధైర్యం, నిబద్ధత, కష్టించి పనిచేసే తత్వం ఉన్నవారు ఎంతమందని ఆయన ప్రశ్నించారు. అవినీతిపరులే నానాటికీ ధనవంతులు, బలవంతులు అవుతున్నారని.. అందువల్ల పిల్లలకు తప్పుడు సంకేతాలు వెళ్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
మీ పిల్లలను ఇంగ్లీషు మీడియం చదువులు చదివిస్తూ పేదల పిల్లలను మాత్రం మాతృభాషకు మాత్రమే పరిమితం చేస్తారా.. ఇదేనా మీ న్యాయం? అని ప్రశ్నించారు. దేశంలో త్రిభాషా సూత్రాన్ని అమలుచేయాలని ఆయన గట్టిగా చెప్పారు. కార్పొరేట్ పెద్దలు, ఉన్నతాధికారులు, రాజకీయ నాయకులు అంతా ఇలాగే వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. రంజినీ మణ్యన్ రచించిన 'అప్‌వర్డ్‌లీ మొబైల్' పుస్తకావిష్కరణ సభలో ఆయన మాట్లాడారు. నిరుపేద ప్రజలకు కూడా అవకాశాలన్నీ అందాలంటే వారు అన్నీ నేర్చుకునేలా మనం చూడాలని చెప్పారు.
పిల్లల సామర్థ్యాన్ని మనతో పోల్చుకుని అంచనా వేయడం తప్పని, ఈ తరం పిల్లలంతా చాలా చురుగ్గా ఉంటున్నారని, వాళ్లకు పూర్తి స్వేచ్ఛనిచ్చి మాతృభాష, దేశ భాష, ఇంగ్లీష్ మూడూ నేర్చుకునే అవకాశం ఇవ్వాలని సూచించారు. పిల్లలు మూడు భాషలనూ చాలా సులభంగా నేర్చుకోగలరని, అలా నేర్చుకుంటే వాళ్లకు కేవలం రాష్ట్రం, దేశంలోనే కాక ప్రపంచవ్యాప్తంగా అవకాశాలు వస్తాయని నారాయణమూర్తి అభిప్రాయపడ్డారు. అందుకే త్రిభాషా సూత్రాన్ని అమలుచేయాలన్నారు.
మహారాష్ట్ర నుంచి కర్ణాటక వచ్చిన పిల్లలకు ఒకటో తరగతి నుంచి కన్నడం కూడా నేర్పాలని.. అందువల్ల స్థానిక సంస్కృతి వాళ్లకు అర్థమవుతుందని సూచించారు. సమాజం కంటే కుటుంబమే ఎక్కువని భారతీయులు భావిస్తారని, దానివల్ల దేశానికి అపార నష్టం వాటిల్లుతోందని చెప్పారు. పాశ్చాత్య దేశాల్లో మాత్రం ఈ రెండింటి మధ్య మంచి సమన్వయం ఉందని నారాయణమూర్తి తెలిపారు. భగవద్గీత మన మనసుకు ప్రశాంతతను కల్పిస్తుందని, దానికి మతంతో సంబంధం లేదని చెప్పారు.

0 comments:
Post a Comment