Pages

Monday

బంగారు సాలీడు...



సన్నగా తెరలు తెరలుగా ఉండే సాలెగూడు కనిపిస్తే చాలు, పుటుక్కున తెంపేస్తాం. అయితే, ఈసారి సాలెగూడు కనిపిస్తే తెంపొద్దు. ఎందుకంటే, మనకు బోలెడు బంగారం వస్తుంది. అసలే, బంగారం రేటు ఆకాశాన్ని అంటుతుంటే, మన ఇంట్లో ఉన్న బంగారుగనిని చేతులారా పాడుచేసుకోడం ఎందుకు...

సాలెపురుగులు బంగారం ఇస్తాయంటే నమ్మలేం కదూ ... మీరే కాదు, శాస్త్రవేత్తలు కూడా నమ్మలేకపోయారు. అయితే, గోల్డెన్ ఆర్బ్ స్పైడర్స్‌పై పలురకాల పరిశోథనలు జరిపిన తర్వాత ఈ విషయాన్ని నిర్ధారించారు. ఈ సాలెపురుగులు ఎక్కువగా నార్త్ అమెరికా ప్రాంతంలో కనిపిస్తాయి. సాధారణంగా వీటిని గోల్డెన్ ఆర్బ్ వీవర్స్, జైయింట్ వుడ్ స్పైడర్స్ లేదా బనానా స్పైడర్స్ అని పిలుస్తారు. సుమారు 165 మిలియన్ సంవత్సరాల నుంచీ ఇవి భూమి మీద ఉన్నాయి.

వీటి పొడవు సుమారు నాలుగు నుంచి ఐదు సెంటీ మీటర్లు ఉంటుంది. సాలె పురుగు గూడు సన్న సన్నని దారాల్లా, తెరలు తెరలుగా ఉంటుంది కదూ. మామూలు సాలె పురుగులు పెట్టేవి గోధుమ రంగుల్లో ఉంటాయి. గూడు అల్లిక మొత్తం ఒకే రంగులో ఉంటుంది. అయితే, గోల్డెన్ ఆర్బ్ వీవర్స్ గూడు మాత్రం ఎల్లో కలర్‌లో ఉంటుంది. ఎండలో చూసినపుడు అచ్చు బంగారురంగులో తళతళా మెరుస్తూ ఉంటుంది. బంగారు వన్నెలో మెరిసిపోయే ఈ దారాలను ఇప్పుడు బట్టలపై డిజైన్ చేయడానికి ఉపయోగిస్తున్నారు. 

పట్టుపురుగుల నుంచి పట్టును తీసి పట్టుబట్టలు తయారుచేసినట్టుగా, గోల్డెన్ ఆర్బ్స్ నుంచి సేకరించిన దారాలతో, గోల్డెన్ డ్రస్సులను రూపొందిస్తున్నారు. ఈ దారాలతో నేసిన ఒక డ్రస్‌ను ఫ్యాషన్ డిజైనర్లు మార్కెట్‌లోకి ఇటీవలే విడుదల చేశారు. అయితే, గోల్డెన్ ఆర్బ్స్ సాలీళ్ళు అన్నీ బంగారు దారాలతో గూళ్లను కట్టవు. కేవలం ఆడ సాలీళ్ళు మాత్రమే బంగారు గూళ్లు పెడతాయి. ఒక్కో గూడులో వలయాకారంగా ఉన్న దారాలు నలభై నుంచి అరవై వరకూ ఉంటాయి. మెదటి 4 లైన్లు మిగిలిన సాలీడు గూడులానే ఉంటుంది. ఐదో వలయం నుంచి ఎల్లో కలర్, గోల్డ్ కలర్ వలయాలు కనిపిస్తాయి. అయితే, ఈ సాలీళ్లు కేవలం ఆరు నెలలకు ఒకసారి మాత్రమే గూడును పెడతాయి.

No comments:

Post a Comment